సంరక్షణ గృహానికి చిన్నారులు | Children 's care homes | Sakshi
Sakshi News home page

సంరక్షణ గృహానికి చిన్నారులు

Published Sun, Sep 18 2016 12:00 AM | Last Updated on Wed, Sep 19 2018 8:32 PM

సంరక్షణ గృహానికి  చిన్నారులు - Sakshi

సంరక్షణ గృహానికి చిన్నారులు

కడప కార్పొరేషన్‌:

కడప నగరంలో భిక్షమెత్తుతున్న ఇద్దరు బాలలను స్త్రీ, శిశు అభివృద్ది సంస్థ(ఐసీడీఎస్‌) అధికారులు రక్షించారు. వారిని చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ ఎదుట హాజరుపరిచి సంరక్షణ గృహానికి తరలించారు. వివరాలిలా ఉన్నాయి...చిన్న వెంకట సుబ్బయ్య(50) అనే వ్యక్తికి తిరుపతిలో మతిస్థిమితం లేని ఓ మహిళ తారసపడింది. ఆమె మాట్లాడలేదు. ఆమెను లొంగదీసుకున్న అతను  చిన్నారులు ఆంజనేయులు(6), లక్ష్మి(1)లను కూడా తన ఆధీనంలో ఉంచుకొని భిక్షమెత్తిస్తున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం ఆర్టీసీ బస్టాండు వద్ద చిన్నారి లక్ష్మిని ఎత్తుకొని దీనంగా భిక్షమెత్తుతున్న ఆంజనేయులును ఐసీడీఎస్‌ అధికారులు గుర్తించారు. వారిచే ఎవరైనా ఈ పనిచేయిస్తున్నారేమోనని అనుమానంతో ఆ పిల్లలకు భిక్షం వేయవద్దని వారించసాగారు. తాపీగా చెట్టుకింద పడుకొని ఇదంతా చూసిన చిన్నవెంకట సుబ్బయ్య ఐసీడీఎస్‌ అధికారులపై దౌర్జన్యానికి దిగాడు. దీంతో వారు పోలీసుల ద్వారా ఆ  నలుగురిని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ రాఘవరావు దగ్గరికి తీసుకొచ్చారు. పీడీ పిల్లలిద్దరినీ  సీడబ్లు్యసీ ఎదుట హాజరుపరిచి వారి అనుమతితో సంరక్షణశాలకు తరలించారు. అనంతరం రాఘవరావు మాట్లాడుతూ ఆ పిల్లలిద్దరూ అతనికి పుట్టినవారు కాదని, అందుకే ఆ పిల్లవాణ్ని కొడుతూ భిక్షమెత్తిస్తున్నాడని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement