ఐసీడీఎస్‌లో మెరుగైన సేవలకు కృషి
Published Wed, Aug 24 2016 12:57 AM | Last Updated on Wed, Sep 19 2018 8:32 PM
తడికలపూడి (కామవరపుకోట) : జిల్లాలోని పద్దెనిమిది ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో అందిస్తున్న సేవలను మరింత బలోపేతం చేసేందుకుSకృషి చేస్తున్నట్టు జిల్లా మహిళా, శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.చంద్రశేఖరరావు పేర్కొన్నారు. ఇందుకు స్ట్రెన్తనింగ్ న్యూట్రిషన్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా 18 ఐసీడీఎస్‌ప్రాజెక్టులను నాలుగు డివిజన్లుగా విభజించి సూపర్‌వైజర్లకు తడికలపూడి దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం (మహిళా ప్రాంగణం)లో ’అనుబంధ పోషకాహారం– ఆహారంలో వైవిధ్యత’(మాడ్యూల్ 9)అనే అంశంపై 23 నుంచి 27 వరకు శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. కొవ్వూరు డివిజన్లోని సూపర్‌వైజర్లకు మంగళవారం ఒక రోజు శిక్షణ ఇచ్చామన్నారు. ఐఎస్‌ఎస్‌ఎన్‌ఐపీ కన్సల్టెంట్ సుధాకర్, ప్రాంగణం అధికారిణి ఎం.ఉమాదేవి పాల్గొన్నారు.
Advertisement
Advertisement