పుష్కరఘాట్ (రాజమండ్రి) : జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్)లో భాగమైన సమగ్ర శిశు సంరక్షణ సంస్థ (ఐసీపీఎస్) సిబ్బంది గోదావరి పుష్కరాల్లో విశేష సేవలందిస్తున్నారు. రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్, గోదావరి రైల్వే స్టేషన్, సెంట్రల్ కంట్రోల్ రూమ్, మెయిన్ కంట్రోల్ రూమ్‌లలో ఐసీపీఎస్ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి తప్పిపోయిన చిన్నారులను చేరదీసి వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఈ పది రోజుల్లో సుమారు 200 మంది చిన్నారులు, రెండు వేల మంది పెద్దలు వారి కుటుంబ సభ్యుల నుంచి తప్పిపోవడంతో వారిని ఐసీపీఎస్ అధికారులు చేరదీసి మైకుల ద్వారా ప్రచారం చేసి వారి వద్దకు చేర్చారు. 24 మంది ఐసీపీఎస్ సిబ్బంది గోదావరి పుష్కరాలలో సేవలందిస్తున్నారు.
నలుగురితో రెస్క్యూటీమ్ :
గోదావరి పుష్కరాల్లో తప్పిపోయిన చిన్నారులను సంరక్షించేందుకు వివిధ ఘాట్‌లు, రాజమండ్రిలో నలుగురు సభ్యులతో రెస్క్యూ టీమ్‌ను ఏర్పాటు చేశారు. వారు అన్ని ప్రాంతాల్లో సంచరిస్తూ చిన్నారులను చేరదీసి వారిని చిల్డ్రన్ హోమ్‌కు తరలించి సంరక్షిస్తూ వారిని తల్లిదండ్రుల చెంతకు చేరుస్తున్నారు. రాజమండ్రికి చెందిన ఏకలవ్య చిల్డ్రన్ హోమ్, సీడీపీఓ ఎస్‌ఎస్ కుమారి, జిల్లా బాలల సంరక్షణాధికారి సీహెచ్ వెంకట్రావు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
మిస్ అయితే.. ఉందిగా ఐసీపీఎస్
Published Sat, Jul 25 2015 12:39 AM | Last Updated on Wed, Sep 19 2018 8:32 PM
Advertisement
Advertisement