కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లా క్లబ్‌ను ఖాళీ చేయించేందుకు దూకుడు పెంచిన జిల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్‌కు హైకోర్టు బ్రేక్ వేస్తూ, ఖాళీ చేయించొద్దంటూ శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో జిల్లా క్లబ్ వ్యవహారం నిర్వాహకులకు, అధికారుల మధ్య రాజుకునే స్థాయి కి వెళ్లింది.
జిల్లా నడిబొడ్డున ప్రభుత్వ కార్యాలయాల పక్కన విలువైన స్థలంలో క్లబ్‌ను ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని ఎప్పుడు కేటాయించారు... అందుకు సంబంధించిన పేపర్లను చూపాలనీ.. లేదంటే వెంటనే ఖాళీ చేస్తే స్వాధీనం చేసుకొని ప్రభుత్వ కార్యాలయ నిర్వహణకు అప్పగిస్తామనిబాధ్యులకు నోటీసులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ అధికారులను ఆదేశించారు.
దీంతో రంగంలోకి దిగిన మహబూబ్‌నగర్ తహశీల్దార్ యాదగిరి రెడ్డి ఫిబ్రవరి 13న క్లబ్ నిర్వాహకులకు నోటీసులను జారీ చేశారు. వాటిని అందుకొన్న నిర్వాహకులంతా ఉలిక్కిపడ్డారు. క్లబ్ సభ్యుల్లో అధికులు రాజకీయ ముఖ్య నేతలతోపాటు, విఐపీలు ఉండడంతోవారు దీన్ని సవాలుగా తీసుకొని ఖాళీ చేసే ఆలోచనను విరమించుకోవాల్సిందిగా కలెక్టర్‌పై ఒత్తిడి తెచ్చారు. దీంతో కలెక్టర్ మరో అడుగు ముందుకు వేసి స్థల కేటాయింపుపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశిం చారు.
దీన్నీ నిర్వాహకులు నిర్లక్ష్యం చేస్తూ తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే క్లబ్ చైర్మన్ నటరాజ్ కలెక్టర్ ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించారు. దీనితో ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టి కలెక్టర్ ఉత్తర్వులను అమలు కాకుండా బ్రేకులు వేసింది. దీనిపై తహశీల్దార్ యాదగిరి రెడ్డి వివరణ ఇస్తూ క్లబ్‌కు కేటాయించిన స్థలానికి సంబంధించి ఎలాంటి ఆధారాల్లేని కారణంగానే ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఈ విషయాన్ని కోర్టుకు వివరించి న్యాయస్థానం ద్వారానే ఖాళీ చేయిస్తామని వెల్లడించారు. ఈ విషయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
కలెక్టర్ దూకుడుకు హైకోర్టు బ్రేక్
Published Sun, Apr 13 2014 3:40 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement