పకడ్బందీగా అక్షరాభ్యాసం
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : పాఠశాలలు ప్రారంభం అవుతున్న సందర్భంగా చేపట్టే అక్షరాభ్యా స కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల ని కలెక్టర్ ఎం.గిరిజాశం కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్‌లో విద్యాశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈనెల 12 నుంచి అన్ని పాఠశాలల్లో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా సూచించారు. మండల విద్యాశా ఖ అధికారులు ప్రతిరోజు మూడు గ్రామా లు సందర్శించి అక్షరాభ్యాసంపై విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ఇంటింటికీ తిరిగి బడి ఈడు పిల్లలందరిని పాఠశాలల్లో చేర్పించేందుకు కృషి చేయాలన్నారు. ఇక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చదివే అనాథ బాలికలు, ఏ ఆసరా లేని బాలికలకు ఇంటర్మీడియెట్, ఆ పై చదువులను దరఖాస్తు చేసుకొనేలా చూడాలన్నారు. అలాంటి వారికి అయ్యే ఖర్చును పాలమూరు సేవా నిధి నుంచి వినియోగిస్తామని కలెక్టర్ చెప్పారు. ఈ సేవా నిధి ద్వారా గతేడాది జిల్లాలో 20మందికి పైగా విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించామన్నారు.
ఇక కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో పనిచేస్తూ ఇప్పటి వరకు సంబంధిత ఉపాధ్యాయులకు చార్జీ ఇవ్వని ఉపాధ్యాయులు, హెడ్‌మాస్టర్‌లను సత్వరమే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. విధుల్లో ఆలస్యం వహించే ఉపాధ్యాయులపై కఠిన చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు అధికంగా చేరేందుకు టీటీసీ విద్యార్థులను భాగస్వామ్యం చే యాలని సూచించారు. ఉపాధ్యాయులు లేనిచోట అవసరమైతే సీఆర్‌పీలను నియమించుకో వాలని అధికారులకు వివరించారు. సమావేశంలో ఏజేసీ రాజారాం, జెడ్పీ సీఈఓ రవీందర్, డీ ఆర్‌డీఏ పీడీ చంద్రశేఖర్‌రెడ్డి, డీఈఓ చంద్రమోహన్, రాజీవ్ విద్యామిషన్ సీఈఓ కుసుమ కుమారి, రవీందర్‌లు పాల్గొన్నారు.
యుద్దప్రాతిపదికన మిల్లర్లకు
తడిసిన ధాన్యం
కలెక్టరేట్ : సోమవారం రాత్రి కురిసిన వర్షాలకు తడిసిన ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన మిల్లర్లకు తరలించాల్సిందిగా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్‌లో ధాన్యం తరలింపుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం మార్కెట్లో తడిసిన ధాన్యమే కాకుండా, మిగిలిన దాన్ని సైతం వెంటనే మిల్లర్లకు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. మిల్లర్లకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తోందని, అదే విధంగా మిల్లర్లు ప్రభుత్వాన్నికి సహకరించాల్సిందిగా ఆయన కోరారు. ఇక ధా న్యం రవాణాకు అవసరమైన లారీలను స త్వరమే ఏర్పాటు చేయాల్సిందిగా రవాణా శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఖాళీ గోదాములను గుర్తించి వాటిని విని యోగంలోకి తీసుకోవాలన్నారు. ఇక మిల్లర్లకు రేటు విషయంలో తగిన న్యాయం చే స్తామని చెప్పారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ధాన్యం తరలింపు పక్రియలో జిల్లా యంత్రాంగం కలిసి కట్టుగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో జేసీ ఎల్.శర్మన్, డీఆర్‌డీఏ పీడీ చం ద్రశేఖర్ రెడ్డి, డీఎస్‌ఓ సయ్యద్ యాసిన్, ఆర్టీఓ కృష్ణయ్య, మెప్మా పీడి గీతా, మిల్లర్ల సంఘం అధ్యక్షుడు అశోక్ పాల్గొన్నారు.