కలెక్టరేట్, న్యూస్‌లైన్: స్ట్రాంగ్ రూములకు చేరిన ఈవీ ఎంలకు పటిష్టమైన భద్రత కల్పించినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం.గిరిజాశంకర్ వెల్లడించారు. గురువారం ఆయన ధర్మాపూర్ జేపీఎన్‌సీ కళాశాలలోని మహబూబ్‌నగర్ పార్లమెంట్, దాని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను కలిశా రు. ఈ సందర్భంగా కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ.. పోలింగ్‌బూత్‌ల వారీగా ఈవీఎంలలో పోలైనఓట్లను అభ్యర్థుల సమక్షంలో ఫారం 17ఏ, 17సీలను తనిఖీ చేశారు. ప్రిసైడింగ్ అధికారులు సంతకాలతో సమర్పించిన నివేదికలను పార్టీనేతలకు చూపుతూ వారి సమక్షంలోనే పోలైనఓట్లను ధ్రువీకరించారు. ఈ నివేదికలే కౌంటింగ్‌లో ఉంటాయని, ఇందులో ఎలాంటి తేడా ఉండదని స్పష్టంచేశారు. ఏవైనా సమస్యలు ఉంటే తమదృష్టికి తీసుకురావాలని కోరారు.
ఈవీఎంలను స్ట్రాంగ్‌రూములకు గ ట్టి భద్రతను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ చెప్పారు. ప్రతి స్ట్రాంగ్ రూంకు సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి ఏరోజుకు ఆ రోజు ఫొటోలను యూట్యూబ్‌లో పొం దుపరుస్తామని పేర్కొన్నారు. స్ట్రాంగ్ రూముల్లో భద్రపరచిన ఈవీఎంలను అ భ్యర్థులు, వారిపక్షాన ఏజెంట్లు ఎవరైనా ప్రతిరోజు తనిఖీ చేసుకోవచ్చన్నారు. ఇ క్కడ కంట్రోల్ రూంను ఏర్పాటు చేస్తున్నామని, ఎవరైనా ఫోన్‌చేసి అన్నివివరా లు తెలుసుకోవచ్చని వారికి సూచించారు.
మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంతోపాటు మహబూబ్‌నగ ర్, జడ్చర్ల, షాద్‌నగర్, కొడంగల్, మక్త ల్, నారాయణపేట, దేవరకద్ర అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరచిన స్ట్రాంగ్‌రూములను కలెక్టర్‌తోపాటు సాధారణ ఎన్నికల పరిశీలకు లు మోజెస్ చలాయ్, అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులు అబ్రహాం, తివారీ, ఎస్పీ డి. నాగేంద్రకుమార్, ఏజేసీ రాజారాం, డీ ఆర్‌ఓ రాంకిషన్, అసెంబ్లీ నియోజకవర్గా ల రిటర్నింగ్ అధికారులు హన్మంతరావు, శ్రీనివాస్‌రెడ్డి, హరిత పార్టీ నేతలతో కలిసి తనిఖీచేశారు. స్ట్రాంగ్ రూముల్లో బ్యాలెట్ యూనిట్లు, కంట్రోలింగ్ యూని ట్లను ఏర్పాటు చేసిన విభాగాలను విడిగా పరిశీలించి అందరి సమక్షంలోనే వాటికి సీలు వేశారు.
ఈవీఎం..భద్రత ‘స్ట్రాంగ్’
Published Fri, May 2 2014 2:14 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement