ముచ్చటగా..3
జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్: ‘పరిషత్’పోరుకు నామినేషన్ల పర్వం సోమవారం ప్రారంభమైంది. నామినేషన్ల ప్రక్రియను కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ స్వయంగా పర్యవేక్షిం చారు. తొలిరోజు అందులో హోలీ పండుగ కావడంతో నామినేషన్ల పర్వంలో కోలాహలం కనిపించలేదు. బుధవారం అధికంగా నామినేషన్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
మొదటిరోజు కాంగ్రెస్ నుం చి 12 మంది నామినేషన్ల వేసి మంచి ఊపుమీద ఉన్నా రు. టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల నుంచి ఒక్క నామినేషన్ కూడా వేయలేదు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ.. నామినేషన్ పూర్తిగా భర్తి చేశారా లేదా, సంతకా లు సరిగా ఉన్నాయనే విషయాన్ని క్షణ్ణంగా పరిశీలించి స్వీకరించాలన్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా హోలీ పండుగ కావడంతో నామినేషన్ల రావనుకునా జిల్లా వ్యా ప్తంగా 23 మంది అభ్యర్థులు ఎంపీటీసీలుగా అభ్యర్థులు వేశారు.
జెడ్పీటీసీ అభ్యర్థులు ముగ్గురు ఉన్నారు. అం దులో కేవలం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మాత్రమే వేశా రు. ఇందులో అడ్డాకుల నుంచి బి. కృష్ణయ్య, పెబ్బేర్ నుంచి చిన్నమాసులు, కొల్లాపూర్ నుంచి బండి వెంకట్‌రెడ్డి ఉన్నారు.
ఎంపీటీసీలకు 20 మంది అభ్యర్థులు నామినేషన్లు వే శారు. మహబూబ్‌నగర్ డివిజన్‌లో అడ్డాకులలో 3, మ హబూబ్‌నగర్‌లో 1, వనపర్తి డివిజన్ కొత్తకోటలో 1, ఖి ల్లాఘనపూర్‌లో 2, పాన్‌గల్‌లో 2, వీపనగండ్ల 1, నారాయణపేట్ డివిజన్ కోస్గిలో 1, మక్తల్‌లో 1, నారాయణపేట్‌లో 1, గద్వాలలో అలంపూర్‌లో 1, మానవపాడు లో 2, నాగర్‌కర్నూల్ డివిజన్ అచ్చంపేటలో 1, బిజినేపల్లిలో 2, తాడూర్‌లో 1 చొప్పున నామినేషన్లు దా ఖలయ్యాయి.
ఎంపీటీసీ అభ్యర్థుల్లో సీపీఐ నుంచి ఒక రు, కాంగ్రెస్ నుంచి 12, వైఎస్‌ఆర్ సీపీ నుంచి ఒకరు, టీడీపీ నుంచి ఇద్దరు, నలుగురు స్వతంత్రులు నామినేషన్లు వేశారు.