సొంత రాజధానిపై బాంబు జారవిడిచిన సైన్యం | Iraq Warplane Accidentally Bombs Baghdad, Killing 7 | Sakshi
Sakshi News home page

సొంత రాజధానిపై బాంబు జారవిడిచిన సైన్యం

Published Mon, Jul 6 2015 4:02 PM | Last Updated on Sun, Sep 3 2017 5:01 AM

సొంత రాజధానిపై బాంబు జారవిడిచిన సైన్యం

సొంత రాజధానిపై బాంబు జారవిడిచిన సైన్యం

నిత్యం ఉగ్రవాదులతో పోరాడుతూ వారిని ఎదుర్కొనే క్రమంలో బాంబు దాడులకు దిగే ఇరాక్ సైన్యం చిన్న నిర్లక్ష్యం కారణంగా సొంత రాజధానిలోనే ఓ విధ్వంసాన్ని చూడాల్సి వచ్చింది.

బాగ్దాద్: ప్రాంతంమనది, దేశం మనది అనే విషయం మనకి తెలుస్తుంది తప్ప బాంబులకు తెలియదు కదా! శత్రుదేశాల్లో అయినా.. మాతృదేశాల్లో అయినా పేలిపోవడమే వాటి బాధ్యత. అందుకే విధ్వంసం సృష్టించే వీటిపట్ల ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రాణనష్టం, ఆస్తి నష్టం చవి చూడాల్సిందే. నిత్యం ఉగ్రవాదులతో పోరాడుతూ వారిని ఎదుర్కొనే క్రమంలో బాంబు దాడులకు దిగే ఇరాక్ సైన్యం చిన్న నిర్లక్ష్యం కారణంగా సొంత రాజధానిలోనే ఓ విధ్వంసాన్ని చూడాల్సి వచ్చింది.

బాంబు దాడులకు ఉపయోగించే తమ దేశ సుఖోయ్ యుద్ధ విమానం నుంచి ఓ బాంబు జారి బాగ్దాద్పై పడి ఏడుగురు మృతిచెందారు. పన్నెండుమందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ఆర్మీ విభాగం తెలిపింది. 'సుఖోయ్ విమానంలో సాంకేతిక లోపం కారణంగా ఓ బాంబు ఇరుక్కుపోయింది. దానిని తొలగించే ప్రయత్నం చేస్తుండగా అది జారి బాగ్దాద్లోని జదీదా ప్రాంతంలోగల ఆరు ఇళ్లపై పడింది. దీంతో అక్కడ ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగింది. రష్యా నుంచే ఇరాక్ ఈ యుద్ధ విమానాలు దిగుమతి చేసుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement