ఇరాక్ రాజధాని బాగ్దాద్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది.
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. బాగ్దాద్ ఆగ్నేయ ప్రాంతంలో జరిగిన కారుబాంబు దాడి ఘటనలో కనీసం 24 మంది మరణించగా, మరో 35 మంది గాయపడినట్టు ఆస్పత్రి వర్గాలు, పోలీసులు చెప్పారు.
షియా వర్గీయులను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారని స్థానిక పోలీసులు చెప్పగా, భద్రత బలగాలు మాత్రం దుండగులు ఓపెన్ ఎయిర్ మార్కెట్ను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు. ఈ దాడికి బాధ్యులు ఎవరన్నది ఇంకా ప్రకటించలేదు. కాగా షియాలను లక్ష్యంగా చేసుకుని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు గతంలో ఇలాంటి దాడులకు పాల్పడ్డారు.