మోడల్‌ దారుణ హత్య | Iraqi Model Shot Dead In Baghdad | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 28 2018 7:23 PM | Last Updated on Sat, Sep 29 2018 11:37 AM

Iraqi Model Shot Dead In Baghdad - Sakshi

తారా ఫేర్స్‌ (ఇన్‌స్టాగ్రామ్‌ ఫొటో)

బాగ్దాద్‌ : తారా ఫేర్స్‌ అనే ఇరాకీ మోడల్‌ దారుణ హత్యకు గురైంది. తన ఇంటి నుంచి పోర్షే వాహనంలో బయల్దేరిన తారా(22)పై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి కాల్చి చంపారు. కారులో నుంచి ఆమెను కిందకి లాగి తుపాకీ గురిపెట్టి వరుసగా మూడు బుల్లెట్లు తలలోకి దించారు. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. గురువారం చోటుచేసుకున్న ఈ ఘటనపై దర్యాప్తు వేగవంతం చేయాల్సిందిగా ఇరాక్‌ ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది.

కాగా తారా మోడల్‌గా రాణిస్తూ తనకంటూ లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తారాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.7 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అయితే సంప్రదాయాలకు విరుద్ధంగా మోడల్‌గా పని చేస్తుందన్న కారణంగానే ఛాందసవాదులు తారను అత్యంత దారుణంగా చంపివేశారంటూ ఆమె అభిమానులు ఆరోపిస్తున్నారు.  ‘అందరు అమ్మాయిల్లాగే జీవితాన్ని తనకు నచ్చినట్టుగా, సంతోషంగా గడపాలనుకున్న తారాను కొంత మంది ఉగ్రవాదులు కాల్చి చంపారు. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ గురువారం తారా వాళ్ల టార్గెట్‌. వచ్చే గురువారం ఇంకెవరో.  స్వేచ్ఛగా జీవించాలనుకునే అమ్మాయిలకు ఇక్కడ ఇలా జరగడం సాధారణమైపోయింది కదా. నిజంగా సిగ్గు పడాల్సిన విషయం’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా ఇరాకీ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement