ఇరాక్లో వరుస బాంబు పేలుళ్లు: 27 మంది మృతి | 27 killed in Iraq car bombs | Sakshi

ఇరాక్లో వరుస బాంబు పేలుళ్లు: 27 మంది మృతి

Sep 30 2013 6:12 PM | Updated on Aug 14 2018 3:22 PM

ఇరాక్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. సోమవారం జరిగిన వరుస కారు బాంబు పేలుళ్లలో 27 మంది మరణించగా, మరో 129 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఇరాక్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. సోమవారం జరిగిన వరుస కారు బాంబు పేలుళ్లలో 27 మంది మరణించగా, మరో 129 మంది తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం 12 కార్లలో బాంబులు అమర్చి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు అధికార వర్గాలు తెలిపాయి. మొత్తం తొమ్మిది చోట్ల బాంబులు పేలాయి.
ఇరాక్లో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో హింస చెలరేగుతోంది. ఆదివారం జరిగిన తిరుగుబాటు దాడుల్లో 55 మంది ప్రజలు మరణించారు. జనవరి-ఆగస్టు మధ్య దాదాపు ఐదు వేల మంది పౌరులు మరణించి ఉంటారని అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement