బాంబులతో దద్దరిల్లిన బాగ్దాద్ | suicide attack in baghdad, kills 30 people | Sakshi
Sakshi News home page

బాంబులతో దద్దరిల్లిన బాగ్దాద్

Published Fri, Jul 8 2016 7:48 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

బాంబులతో దద్దరిల్లిన బాగ్దాద్ - Sakshi

బాంబులతో దద్దరిల్లిన బాగ్దాద్

బాగ్దాద్: ఇరాక్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బాగ్దాద్ ఉత్తర ప్రాంతం బొలాడ్లోని షీతే ప్రర్ధనామందిరం వద్ద ఉగ్రవాదులు గురువారం రాత్రి ఆత్మాహుతి దాడులకు పాల్పడి.. విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో 30 మందికి పైగా మృతి చెందగా.. 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సహాయక బలగాలు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాయి. ఉగ్రదాడులకు పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.

కాగా, ఆదివారం బాగ్దాద్లోని రద్దీగా ఉన్న మార్కెట్ ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన బాంబు పేలుళ్లలో మృతుల సంఖ్య 185కు పెరిగిందని అధికారులు వెల్లడించారు. వరుస బాంబు పేలుళ్లపై ఇరాక్లో తీవ్ర నిరసనలు వ్యక్తమౌతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement