ఇరాక్లో కారు బాంబు దాడి.. ఏడుగురు మృతి
ఇరాక్లో కారు బాంబు దాడి.. ఏడుగురు మృతి
Published Tue, Sep 6 2016 7:31 AM | Last Updated on Tue, Aug 14 2018 3:22 PM
ఉగ్రవాదులు కారు బాంబుతో దాడికి పాల్పడటంతో దాదాపు 7 మంది మృతిచెందగా, మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం రాత్రి ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో చోటుచేసుకుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గత జూలైలో బాంబు దాడి జరిగి 300కు పైగా ప్రాణాలను బలిగొన్న ఏరియాకు సమీపంలోనే ఈ దుర్ఘటన జరగడం గమనార్హం.
సోమవారం అర్ధరాత్రి కారు బాంబు పేల్చివేయడంతో దాదాపు ఏడుమంది వ్యక్తులు దుర్మరణం పాలవ్వగా, 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అబ్దెల్ మజీత్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమీపంలోని కొన్ని షాపులు దగ్ధమయ్యాయి. ఇప్పటివరకూ ఏ ఉగ్రవాద సంస్థ ఈ చర్యకు బాధ్యత వహించలేదని ఇరాక్ అధికారులు వివరించారు. ఐఎస్ఎస్ ఉగ్రసంస్థ గతంలో ఇలాంటి దాడులకు పాల్పడిందని అధికారులు చెప్పారు.
Advertisement
Advertisement