ఆత్మాహుతి దాడుల్లో 15 మంది మృతి | Two suicide attacks in Baghdad kill at least 14 people | Sakshi
Sakshi News home page

ఆత్మాహుతి దాడుల్లో 15 మంది మృతి

Published Thu, Sep 17 2015 4:52 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

Two suicide attacks in Baghdad kill at least 14 people

బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో గురువారం జరిగిన రెండు ఆత్మాహుతి దాడుల్లో కనీసం 15 మంది మృతి చెందారు. సెంట్రల్ బాగ్దాద్ లోని వాణిజ్య ప్రాంతాల్లో ఉన్న పోలీసు చెక్ పోస్టులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. బాబ్ అల్-షార్జి ప్రాంతంలో మానవబాంబు జరిపిన దాడిలో  8 మంది పౌరులు, పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారు. 21 మంది గాయపడ్డారు.

అల్-వత్బా స్క్వేర్ వద్ద జరిగిన మరో ఆత్మాహుతి దాడిలో ఇద్దరు పోలీసులతో సహా ఆరుగురు మృతి చెందారు. 12 మంది క్షతగాత్రులయ్యారు. ఈ దాడులకు తామే బాధ్యులకు ఏ సంస్థా ప్రకటించుకోలేదు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement