ఆత్మాహుతి దాడిలో 17 మంది మృతి | Suicide bombing at Baghdad service kills 17 | Sakshi
Sakshi News home page

ఆత్మాహుతి దాడిలో 17 మంది మృతి

Published Fri, Nov 13 2015 7:17 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

Suicide bombing at Baghdad service kills 17

బాగ్దాద్: ఇరాక్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రాజధాని బాగ్దాద్లో శుక్రవారం ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 17 మంది మృతి చెందగా, మరో 40 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడికి పాల్పడినట్లు ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. అయితే ఇది ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల పనే అయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.


బాగ్దాద్ నైరుతి ప్రాంతంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులతో పోరులో మరణించిన వారి ఙ్ఞాపకార్థం నిర్వహిస్తున్న కార్యక్రమంపై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. షియా వర్గానికి చెందిన సమూహాలపై ఈ మధ్యకాలంలో ఐఎస్ఐఎస్ దాడులు పెరిగిపోతున్నాయనీ, ఈ డాడి కూడా అందులో భాగమేనని ఇరాక్ అధికారులు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement