ఇరాక్లో నిన్న దేశావ్యాప్తంగా జరిగిన హింసలో 45 మంది మరణించారని, మరో 63 మంది గాయపడ్డారని పోలీసు ఉన్నతాధికారులు గురువారం ఇక్కడ వెల్లడించారు.
ఇరాక్లో నిన్న దేశావ్యాప్తంగా జరిగిన హింసలో 45 మంది మరణించారని, మరో 63 మంది గాయపడ్డారని పోలీసు ఉన్నతాధికారులు గురువారం ఇక్కడ వెల్లడించారు. గాయపడిన క్షతగాత్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.
నిన్న ఉదయం బాగ్దాద్లోని కస్రా ప్రాంతంలో తిమిమి మసీద్ వద్ద ఓ వ్యక్తి ఆత్మహుతికి పాల్పడ్డాడని, ఆ ఘటనలో 30 మంది మరణించరన్నారు. 55 మంది గాయపడ్డారని తెలిపారు. అలాగే నైనివా ఉత్తర ప్రావెన్స్లో ఆగంతకుడు జరిపిన తుపాకి కాల్పుల్లో నలుగురు సైనికులు మరణించారు. వారిలో ఓ ఆధికారి కూడా ఉన్నారన్నారు.
మౌసులలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిపై ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఆయన అక్కడికక్కడే కుప్పకులారన్నారు. మౌసుల నగరంలోని తూర్పు ప్రాంతంలో నాలుగు మృతదేహలను భద్రత దళాలు కనుగొన్నాయి. మృతదేహాల తలలు, గుండెలపై తుపాకి గుళ్లు తగిలిన అనవాళ్లు ఉన్నట్లు గమనించామన్నారు. బురుజ్ పట్టణం సమీపంలోని చెక్ పోస్ట్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసు ఉన్నతాధికారులు వివరించారు.