Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Chandrababu Itself Liquor Mafia Don in Andhra Pradesh1
లిక్కర్‌ మాఫియా డాన్‌ 'చంద్రబాబే'

సాక్షి, అమరావతి: దొంగే.. ‘దొంగా...దొంగా!’ అని అరుస్తున్నట్లుగా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు!! మద్యం విధానం ముసుగులో కుంభకోణానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిన ఆయన తన దోపిడీని కప్పిపుచ్చేందుకు అక్రమ కేసు కుట్రకు తెరతీశారు. మద్యం కుంభకోణంలో గతంలో సీఐడీ నమోదు చేసిన కేసులో నిందితుడైన చంద్రబాబు ప్రస్తుతం ముందస్తు బెయిల్‌పై ఉన్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగా తొక్కిపెడుతున్నారు. మరోవైపు వైఎస్సార్‌సీపీ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేసి తన పన్నాగానికి పదును పెడుతున్నారు. టీడీపీ వీర విధేయులతో నియమించిన సిట్‌ ద్వారా కుతంత్రానికి పాల్పడుతున్నారు. బెదిరింపులు, వేధింపులు, అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు, ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం... ఇవన్నీ టీడీపీ కూటమి ప్రభుత్వ రెడ్‌బుక్‌ కుట్రలో అంతర్భాగాలుగా మారుతున్నాయి. గతంలో టీడీపీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అవాస్తవ ఆరోపణలతో దాఖలు చేసిన కేసును ‘కాంపిటీటివ్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) కొట్టివేయడం గమనార్హం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ మద్యం విధానం పారదర్శకంగా ఉందని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కానీ అవే అవాస్తవ ఆరోపణలతో ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేయడం రెడ్‌బుక్‌ కుతంత్రమేనన్నది స్పష్టమవుతోంది. అసలు మద్యం మాఫియా డాన్‌ చంద్రబాబే అని నిరూపించే వాస్తవాలు ఇవిగో ఇలా ఉన్నాయి... సూత్రధారి, లబ్ధిదారు బాబే... రూ.25 వేల కోట్ల లూటీపై ఆధారాలతో సీఐడీ కేసు 2014–19 మధ్య టీడీపీ హయాంలో మద్యం సిండికేట్‌ ద్వారా చంద్రబాబు యథేచ్చగా దోపిడీకి గేట్లు తెరిచారు. మద్యం దుకాణాలు, బార్ల ప్రివిలేజ్‌ ఫీజును రద్దు చేస్తూ చీకటి జీవోలతో ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారు. 4,380 ప్రైవేటు మద్యం దుకాణాలు, 4,380 పర్మిట్‌ రూమ్‌లు, 43 వేల బెల్ట్‌ దుకాణాలతో మద్యాన్ని ఏరులుగా పారించారు. టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు, డీకే ఆదికేశవులు, ఎస్పీవై రెడ్డి కుటుంబాలకు చెందిన 14 కొత్త డిస్టిలరీలకు అనుమతినిచ్చారు. మొత్తం 20 డిస్టిలరీలను బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా మద్యం కొనుగోళ్లకు ఎంప్యానల్‌ చేశారు. అంతేకాదు తమ అస్మదీయులకు చెందిన నాలుగు డిస్టిలరీల నుంచే ఏకంగా 69 శాతం మద్యం కొనుగోళ్లు చేశారు. చీప్‌ లిక్కర్‌లో బ్రాండ్లకు ఎలాంటి వాల్యూ లేదని ఊరూపేరూలేని దాదాపు 200 మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టారు. ప్రెసిడెంట్‌ మెడల్, పవర్‌ స్టార్, లెజెండ్, టీఐ మాన్షన్‌ హౌస్, హై ఓల్టేజ్‌ వంటివి వాటిలో కొన్ని. వీటిని గతంలో సీఐడీ ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. మంత్రిమండలికి కూడా తెలియకుండా ప్రివిలేజ్‌ ఫీజు రద్దు చేస్తూ చీకటి జీవోలు జారీ చేసిన నోట్‌ ఫైళ్లపై అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి హోదాలో కొల్లు రవీంద్ర సంతకాలు చేసిన పత్రాలు వెలుగులోకి వచ్చాయి. తద్వారా ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.5 వేల కోట్లకుపైగా గండి కొట్టారు. ఎంఆర్‌పీ కంటే ఏకంగా రూ. 20 నుంచి రూ. 30 వరకు రేట్లు పెంచి విక్రయించడం ద్వారా టీడీపీ మద్యం సిండికేట్‌ ద్వారా ఆ ఐదేళ్లలో రూ.20 వేల కోట్లు కొల్లగొట్టారు. వెరసి మొత్తం రూ.25 వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. టీడీపీ హయాంలో మద్యం దోపిడీకి పాల్పడ్డారని రాజ్యాంగబద్ధ సంస్థ కంప్ట్రోలర్‌ అండ్‌ అడిటర్‌ జనరల్‌ సైతం స్పష్టం చేసింది. చంద్రబాబు మద్యం దోపిడీని సీఐడీ ఆధారాలతోసహా నిగ్గు తేల్చింది. చంద్రబాబు, కొల్లు రవీంద్ర తదితరులపై సీఐడీ 2023లో ఐపీసీ సెక్షన్లు: 166, 167, 409, 120(బి) రెడ్‌ విత్‌ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు: 13(1),(డి), రెడ్‌ విత్‌ 13(2) కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఆ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఆ కేసులో ఆయన ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఇక స్కిల్‌ స్కామ్‌లో అరెస్టై 52 రోజులు రిమాండ్‌లో ఉన్న అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. అసైన్డ్‌ భూముల దోపిడీ, ఇన్నర్‌రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌లో అక్రమా­లు, ఫైబర్‌ నెట్‌ కుంభకోణం, ఇసుక దోపిడీ కుంభకోణం కేసుల్లో కూడా చంద్రబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ కేసుల దర్యాప్తును అటకెక్కించింది. చంద్రబాబుపై మద్యం దోపిడీ కేసుతోపాటు ఇతర కేసులు న్యాయస్థానం విచారణలోనే ఉన్నాయనే వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం యత్నిస్తోంది. మ­రోవైపు టీడీపీ కూటమి ప్రభుత్వం 2024 నుంచి మ­ళ్లీ ప్రైవేటు మద్యం సిండికేట్‌ దోపిడీకి తలుపులు బా­ర్లా తెరచింది. యథేచ్చగా అదే దోపిడీ సాగిస్తోంది. లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించే కుతంత్రమే... 2019–24 మధ్య వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దశలవారీ మద్య నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలు చేసింది. అంతకుముందు టీడీపీ హయాంలో దోపిడీకి పాల్పడ్డ ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. పారదర్శకంగా ప్రభుత్వ మ­ద్యం దుకాణాలను ప్రవేశపెట్టింది. దుకాణాల వేళల­ను కుదించింది. టీడీపీ హయాంలో ఉన్న 4,380 మద్యం దుకాణాలను దశలవారీగా 2,934 దుకాణా­లకు తగ్గించింది. చంద్రబాబు ప్రభుత్వం అనధికారిక బార్లుగా లైసెన్సులు జారీ చేసిన 4,380 పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా పెట్టిన 43 వేల బెల్ట్‌ దుకాణాలను నిర్మూలించింది. రాష్ట్రంలో 14 డిస్టిలరీలకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులు జారీ చేసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఒక్క మద్యం డిస్టిలరీకి కూడా లైసెన్సులు మంజూరు చేయలేదు. ఈ విప్లవాత్మక చర్యలతో వైఎస్సార్‌సీపీ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. మద్యం అమ్మ­కాలు తగ్గడంతో డిస్టిలరీలకు లాభాలు తగ్గా­యి. అలాంటప్పుడు ఇక కమీషన్లకు ఆస్కారం ఎక్కడుంది? ఇక మద్యం విధానానికి సంబంధించి ఏ ఒక్క ఫైలుపై కూడా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతకాలు చేయలేదు. ఆ వ్యవహారాలన్నీ బెవరేజెస్‌ కార్పొరేషనే సమర్థంగా పర్యవేక్షించింది. చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో సిట్‌ ఎలాంటి ఆధా­రాలు సేకరించలేకపోవడంతో అధికారులు, సాక్షులను బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయడమే పనిగా పెట్టుకుంది. వాటి ఆధారంగానే కేసు కొనసాగించడమే సిట్‌ ఏకైక విధానంగా మారింది. 2014–19 మధ్య మద్యం విధానం ముసుగులో తాను చేసిన కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ప్రస్తుతం చంద్రబాబు ఈ అక్రమ కేసు కుట్రకు తెరతీశారన్నది సుస్పష్టం.విక్రయాలు పెంచిందెవరు? మద్యం అమ్మకాలు పెరిగిన కొద్దీ డిస్టిలరీలకు లాభాలు పెరుగుతాయి. మరి ఏ ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు పెరిగాయన్నది పరిశీలించాలి. గతంలో చంద్రబాబు హయాంలో 2014–19లో మద్యం అమ్మకాలు ప్రతి ఏటా భారీగా పెరగ్గా... అనంతరం వైఎస్‌ జగన్‌ హయాంలో 2019–24లో అమ్మకాలు ప్రతి ఏటా గణనీయంగా తగ్గాయని ఎక్సైజ్‌ శాఖ రికార్డులే స్పష్టం చేస్తున్నాయి. అంటే డిస్టిలరీల నుంచి కమీషన్లు అందింది చంద్రబాబు సర్కారుకేనన్నది సుస్పష్టం. వైఎస్సార్‌సీపీ హయాంలో పారదర్శకంగా మద్యం విధానం తేల్చిచెప్పిన కాంపిటీటివ్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా చంద్రబాబు ప్రభుత్వం తెరపైకి తెచ్చిన అభియోగాలనే గతంలో టీడీపీ దు్రష్పచారం చేసింది. వాటిని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘కాంపిటీటివ్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) నిర్ద్వందంగా తిరస్కరించడం గమనార్హం. వైఎస్సార్‌సీపీ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై టీడీపీ సీసీఐకి 2021లో ఫిర్యాదు చేయించింది. బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా మద్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడుతున్నారని పేర్కొంది. దీనిపై విచారించిన సీసీఐ 2022 సెపె్టంబరు 19న విస్పష్టమైన తీర్పు ప్రకటించింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ మద్యం విధానంలో ఎలాంటి అవకతవకలు జరగడం లేదని.. బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా మద్యం కొనుగోళ్ల విధానం పారదర్శకంగా ఉందని తన తీర్పులో స్పష్టం చేసింది. సీసీఐ తిరస్కరించిన ఆరోపణలతో ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేయడం కేవలం రెడ్‌బుక్‌ కుట్రేనన్నది స్పష్టమవుతోంది. అసలు స్కాం ఎవరిది? లంచాలు ఎవరికి ఇస్తారు?టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే వైఎస్సార్‌సీపీ పాలనలో అమ్మకాలు తగ్గాయి.. ఈ నేపథ్యంలో లిక్కర్‌ వ్యవహారంలో వాస్తవంగా స్కాంలు చేసింది ఎవరు? అనేది పరిశీలిస్తే..⇒ మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా? అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? ⇒ మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? ⇒ విక్రయ వేళలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? లేక ఎక్కువ సమయం అమ్మేలా చేస్తే లంచాలు ఇస్తారా? ⇒ మద్యం దుకాణాలను పెంచితే లంచాలు ఇస్తారా? దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? ⇒ దుకాణాలకు తోడు పర్మిట్‌ రూమ్‌లు, బెల్టు షాప్‌లు పెడితే లంచాలు ఇస్తారా? లేక బెల్టు షాపులు తీసేసి, పర్మిట్‌ రూమ్స్‌ను రద్దు చేస్తే లంచాలు ఇస్తారా? ⇒ 2014-19లో చంద్రబాబు నిర్ణయించిన బేసిక్‌ రేట్లను పెంచి.. డిస్టిలరీల నుంచి కొనుగోళ్లు చేస్తే లంచాలు వస్తాయా? లేక పాత రేట్లను కొనసాగిస్తే లంచాలు వస్తాయా?⇒ మద్యంపై తక్కువ ట్యాక్స్‌ల ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసే విధంగా డిస్టిలరీలకు మేలు చేస్తే లంచాలు వస్తాయా? లేక ట్యాక్స్‌లు పెంచి, తద్వారా అమ్మకాలు తగ్గితే లంచాలు వస్తాయా? ⇒ ఎంపిక చేసుకున్న 4-5 డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? అన్ని డిస్టిలరీలకు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? ⇒ ఇప్పుడున్న డిస్టిలరీలలో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టిలరీకీ అనుమతివ్వని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు వస్తాయా? వైఎస్సార్‌సీపీ హయాంలో.. ⇒ 2019-24 మధ్య ఐదేళ్లలో కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మద్యం విధానంలో అక్రమ దందా సాగించే సిండికేట్‌ వ్యవస్థను పూర్తిగా ఎత్తివేసింది. ⇒ లిక్కర్‌ షాపుల నుంచి పూర్తిగా ప్రైవేటు వ్యక్తులను తొలగించింది. ప్రభుత్వ ఆధీనంలోనే అమ్మకాలు సాగించింది. ⇒ 33 శాతం మద్యం దుకాణాలను తీసివేసింది. షాపుల సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించింది. ⇒ మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న 43 వేల బెల్టు షాపులను, 4,380 పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేసింది. ⇒ మద్యం ధరలను షాక్‌ కొట్టేలా పెంచింది. ఎక్సైజ్‌కు సంబంధించిన నేరాలకు పాల్పడితే శిక్షలను కఠినం చేసింది. ⇒ మద్యం విక్రయాల వేళలను కుదించింది. ప్రతి ఊరికి ఒక మహిళా పోలీసును నియమించింది. దీంతో మద్యం అమ్మకాలు బాగా తగ్గాయి.

India Says China Made Air Defence System In Pak Jammed By Air Force2
పాక్‌, చైనాకు చావు దెబ్బ.. భారత్‌ సూపర్‌ ప్లాన్‌

ఢిల్లీ: పహల్గాం దాడికి పాకిస్తాన్‌పై భారత్‌ ప్రతీకారంగా తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్, పీవోకేపై భారత దళాలు దాడులు చేశాయి. ఈ క్రమంలో దాదాపు వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అనంతరం, భారత్‌ దాడులపై పాక్‌ ప్రతి దాడులు చేసి బిత్తరపోయింది. భారత్‌ దాడులను అడ్డుకోలేకపోయింది. దాయాది పాకిస్తాన్‌కు డ్రాగన్‌ దేశం చైనా అండగా నిలిచినప్పటికీ.. భారత్‌ను ఎదుర్కోలేకపోయింది.ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా భారత్ దాడులను అడ్డుకోవడానికి పాకిస్తాన్ చైనా ఎయిర్ డిఫెన్స్ వాడుకుంది. అయినప్పటికీ పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చైనా వైమానిక రక్షణ వ్యవస్థలను, రాడార్లను భారత్ కేవలం 23 నిమిషాల్లోనే ధ్వంసం చేసింది. మొదట వాటిని జామ్ చేసింది. ఆ తర్వాత పూర్తిగా పని చేయకుండా ధ్వంసం చేసేసింది. కచ్చితమైన లక్ష్యాలతో విజయవంతంగా ఆపరేషన్‌ను పూర్తి చేశామని భారత ఆర్మీ అధికారులు తెలిపారు.ఇందులో చైనాకు చెందిన పీఎల్-15 క్షిపణులు, టర్కీకు చెందిన యూఏవీలు, దీర్ఘ శ్రేణి రాకెట్లు, క్వాడ్ కాప్టర్లు, డ్రోన్లు లాంటి వాటిని భారత్ ఎయిర్ ఫోర్స్ ధ్వంసం చేసింది. పాకిస్తాన్ అధునాతన ఆయుధాలను ఉపయోగించినప్పటికీ, భారతదేశ స్వదేశీ వైమానిక రక్షణ, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలను ఏమీ చేయలేకపోయిందని అధికారులు వెల్లడించారు.IAF jammed Pakistan's China made air defence system, completed Operation sindoor in just 23 mins ..😳🔥🙌🏻 Jai hind 🇮🇳 Jai hind ki sena ❤️ 🇮🇳 #BalochLiberationArmy #IndianAirForce #IndiaPakistanWar pic.twitter.com/pH5TXcETc1— NEHA (@Neha09857) May 14, 2025టార్గెట్‌ ఫినిష్‌..భారత వైమానిక దళం నూర్ ఖాన్, రహీమ్ యార్ ఖాన్ వంటి కీలకమైన పాకిస్తాన్ వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. దాంతో పాటూ ఆత్మాహుతి డ్రోన్‌లను సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా శత్రు రాడార్లు, క్షిపణి వ్యవస్థలు, అధిక-విలువ లక్ష్యాలను ధ్వంసం చేసింది. లాటరింగ్ మందుగుండు సామగ్రి అనేవి ఆయుధ వ్యవస్థలు, ఇవి లక్ష్య ప్రాంతంపై ప్రదక్షిణలు చేసి, తగిన లక్ష్యం కోసం వెతుకుతాయి, ఆపై దాడి చేస్తాయి. వీటినే భారత్ ఉపయోగించింది. భారత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలతో ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతం చేశామని చెప్పారు.సిందూర్ ఆపరేషన్‌లో ఇస్రో పాత్రభారత అంతరిక్ష సంస్థ ఇస్రో కూడా కీలక పాత్ర పోషించిందని భారత ఆర్మీ పేర్కొంది. ఆపరేషన్‌ సిందూర్‌ సందర్భంగా మే 11 నుంచి దేశ పౌరుల భద్రత, వ్యూహాత్మక ప్రయోజనం కోసం కనీసం 10 ఉపగ్రహాలు 24 గంటలూ పనిచేస్తున్నాయని అధికారులు వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ కేవలం వ్యూహాత్మక విజయం కాదు. ఇది భారతదేశ రక్షణ స్వదేశీకరణ విధానాలను ప్రపంచానికి చాటిచెప్పింది. వాయు రక్షణ వ్యవస్థల నుండి డ్రోన్‌ల వరకు భారత్‌ స్వదేశీ సాంకేతికతను అత్యంత ముఖ్యమైన సమయంలో అందించింది. భారత్‌ 21వ శతాబ్దంలో హైటెక్ సైనిక శక్తిగా తన పాత్రను విజయవంతం చేసిందని తెలిపారు.

saraswati river pushkaralu started3
సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభం..

సాక్షి, కాళేశ్వరం: తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. గురువారం తెల్లవారుజామున మాధవానంద సరస్వతీ స్వామి పుష్కరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సరస్వతీ నది వద్ద మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక పూజలు చేశారు. త్రివేణి సంగమం వద్ద పుష్కర్ స్థానం ఆచరించి కుటుంబ సమేతంగా ప్రత్యేక అర్చనలు చేసిన మంత్రి శ్రీధర్ బాబు దంపతులు.ఇక, కాళేశ్వరాలయం నుంచి మంగళ వాయిద్యాలతో నదికి వెళ్లి గణపతి పూజతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. నదిలో నీటికి పంచ కలశాలలో ఆవాహన పూజ నిర్వహిస్తారు. పుష్కరునికి చీర, సారెతో ఒడి బియ్యం, పూలు, పండ్లు సమర్పించారు. తర్వాత భక్తులందరూ పుష్కర సంకల్ప స్నానం చేస్తారు. నేటి నుంచి ఈ నెల 26 వరకు సరస్వతీ నది పుష్కరాలు కొనసాగనున్నాయి. ఇక్కడికి వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ తొలిసారి సరస్వతీ పుష్కరాలు జరుగుతున్నాయి. రోజుకు లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. పుష్కరాలకు సీఎం రేవంత్‌రెడ్డి సరస్వతీ పుష్కరాల్లో కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సరస్వతీ ఘాట్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం సీఎం రేవంత్‌ పుణ్యస్నానం ఆచరిస్తారు. సీఎంతోపాటు పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పుష్కరాలకోసం దేవాదాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది.పుష్కరాల పవిత్రతను కాపాడాలిసరస్వతీ నది పుష్కరాల పవిత్రతను కాపాడుకోవడా నికి అందరూ చేతులు కలపాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. గురువారం నుంచి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరగను న్న సరస్వతీ నది పుష్కరాలను పురస్కరించుకుని కాలుష్య నియంత్రణ బోర్డు రూపొందించిన పోస్టర్‌ను బుధవారం మంత్రి ఆవిష్కరించారు.

IPL To Allow Teams To Pick Temporary Replacements For Remainder Of Season4
ఐపీఎల్‌-2025కు సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌

ఐపీఎల్‌ 2025కు సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. భారత్‌, పాక్‌ మధ్య యుద్దం కారణంగా స్వదేశాలకు వెళ్లిపోయిన ఆటగాళ్లకు తాత్కాలిక ప్రత్యామ్నాయాలకు ఎంపిక చేసుకునే వెసులుబాటును లీగ్‌ గవర్నింగ్‌ బాడీ కల్పించింది. అయితే ప్రత్యామ్నాయంగా వచ్చిన ఆటగాళ్లకు తదుపరి సీజన్‌కు (2026) అర్హత ఉండదని తెలిపింది. ఐపీఎల్‌ రూల్స్‌ ప్రకారం గాయపడిన ఆటగాళ్లకు మాత్రమే ప్రత్యామ్నాయ ఆటగాళ్లను ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అది కూడా సీజన్‌లో వారి 12వ మ్యాచ్‌లోపే ఈ అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల కారణంగా గవర్నింగ్‌ బాడీ ఫ్రాంచైజీలకు ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. కాగా, మే 17 నుంచి లీగ్‌ పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో చాలా మంది విదేశీ ఆటగాళ్లు వేర్వేరు కారణాల చేత అందుబాటులోకి రావడానికి మొరాయిస్తున్నారు. దీంతో ఫ్రాంచైజీలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ప్లే ఆఫ్స్‌ రేసులో ముందున్న ఫ్రాంచైజీలకు ఈ విషయం పెద్ద తలనొప్పిగా మారింది. ఫామ్‌లో లేని ఆటగాడు తిరిగి రాకపోతే ఫ్రాంచైజీలకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఫామ్‌లో ఉన్న ఆటగాడిని వేరే ఆటగాడితో భర్తీ చేయాలన్నా ఫ్రాంచైజీలకు అది పెద్ద మైనస్సే అవుతుంది. ఏది ఏమైనా కీలక దశలో ప్రత్యామ్నాయ ఆటగాడిగాని ఎంపిక చేసుకునే వెసులుబాటులో లభించడంతో ఫ్రాంచైజీలు ఊపిరి పీల్చుకుంటున్నాయి.ఇదిలా ఉంటే, భారత్‌-పాక్‌ మధ్య యుద్దం కారణంగా లీగ్‌ వారం రోజులు వాయిదా పడిన విషయం తెలిసిందే. యుద్దం సమసిపోవడంతో లీగ్‌ రివైజ్డ్‌ షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ షెడ్యూల్‌ వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌ మధ్య జరగాల్సిన వన్డే సిరీస్‌తో క్లాష్‌ అయ్యింది. ఈ సిరీస్‌ జరగాల్సిన మే 29, జూన్‌ 1, 3 తేదీల్లో ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌ రీ షెడ్యూల్‌ అయ్యాయి. దీంతో ప్లే ఆఫ్స్‌కు ఎంపికైన ఫ్రాంచైజీలకు సంబంధించిన ఆటగాళ్లు (ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ సిరీస్‌కు ఎంపికైన వారు) దేశమా.. ఐపీఎలా అని తేల్చుకోలేకపోతున్నారు.దేశానికే ఆడాలని విండీస్‌ క్రికెట్‌ బోర్డు తమ ఆటగాళ్లపై (ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఎంపికైన వారిని) ఎలాంటి ఒత్తిడి చేయనప్పటికీ.. ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు మాత్రం జాతీయ విధులే ముఖ్యమని తేల్చి చెప్పింది. దీంతో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు లీగ్‌ దశ మ్యాచ్‌లు పూర్తి కాగానే జాతీయ విధులు నిర్వర్తించేందుకు వెళ్లిపోతారు. విండీస్‌ ఆటగాళ్లు ప్లే ఆఫ్స్‌కు అందుబాటులో ఉంటారా లేరా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌ సమయంలో జరిగే వన్డే మ్యాచ్‌ల్లో పాల్గొనాల్సిన ఇంగ్లండ్‌, విండీస్‌ ఆటగాళ్లు..జేకబ్‌ బేతెల్‌ (ఆర్సీబీ)విల్‌ జాక్స్‌ (ముంబై ఇండియన్స్‌)జోస్‌ బట్లర్‌ (గుజరాత్‌)షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ (గుజరాత్‌)రొమారియో షెపర్డ్‌ (ఆర్సీబీ)జోఫ్రా ఆర్చర్‌ (రాజస్థాన్‌ రాయల్స్‌), జేమీ ఓవర్టన్‌ (సీఎస్‌కే) కూడా ఈ సిరీస్‌కు ఎంపికైనప్పటికీ వారి ఫ్రాంచైజీలు ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించాయి.

Encounter underway at Jammu Kashmir Nader5
జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఉగ్రవాది హతం

శ్రీనగర్‌​: ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా జమ్ము కశ్మీర్‌లోని అవంతి పొరా ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమైనట్టు అధికారులు వెల్లడించారు.వివరాల ప్రకారం.. జమ్ము కశ్మీర్‌లోని అవంతి పొరా ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఇందులో పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా పాల్గొన్నాయి. ఈ దాడుల్లో ఒక ఉగ్రవాది చనిపోయినట్టు అధికారులు తెలిపారు. ఇక, నాడర్‌, థ్రాల్‌ ప్రాంతంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయని పోలీసులు వెల్లడించారు. గత 48 గంటల్లో కశ్మీర్‌లో ఇది రెండో ఎన్‌కౌంటర్‌ ఘటన అని వారు పేర్కొన్నారు.#WATCH | J&K | Encounter underway at Nader, Tral area of Awantipora. Police and security forces are carrying out the operation. Details awaited. (Visuals deferred by unspecified time) pic.twitter.com/sn92x3MfiN— ANI (@ANI) May 15, 2025

JR BTR And Rajamouli Will Be Started Dada Saheb Phalke Biopic Movie6
'ఫాదర్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా' బయోపిక్‌లో ఎన్టీఆర్‌

టాలీవుడ్‌ స్టార్‌ హీరో ఎన్టీఆర్‌- దర్శకుడు రాజమౌళి మళ్లీ ఒక సినిమా కోసం కలవబోతున్నారు. వీరిద్దరూ కలిసి ఒక బయోపిక్‌ను తెరపైకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు చర్చలు జరిపారని సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు పితామహుడిగా గుర్తింపు పొందిన దాదాసాహెబ్ ఫాల్కే ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే జీవితం ఆధారంగా తెరకెక్కనున్న చిత్రంలో తారక్‌ నటించనున్నారట. ఈమేరకు బాలీవుడ్‌ మీడియాలో పలు కథనాలు వైరల్‌ అవుతున్నాయి. దాదాసాహెబ్ జీవితం అందరినీ ప్రభావితం చేసేలా ఉండటంతో దానిని ఒక సినిమాగా తెరకెక్కించి ప్రపంచానికి చూపాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారట.భారతీయ సినిమా పితామహుడి బయోపిక్‌ నిర్మించేందుకు 'మేడ్ ఇన్ ఇండియా' అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఇందులో దాదాసాహెబ్ ఫాల్కే పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నట్లు సమాచారం. సుమారు రెండేళ్ల క్రితమే రాజమౌళి ఈ టైటిల్‌ను ప్రకటించారు. అయితే, నితిన్‌ కక్కర్‌ దర్శకత్వం వహిస్తారని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్‌ నటించనున్నట్లు బాలీవుడ్‌ మీడియాలో ప్రస్తుతం కథనాలు వస్తున్నాయి.దాదాసాహెబ్ ఫాల్కే (Dhundiraj Govind Phalke), ఆయనను భారతీయ సినిమా పితామహుడిగా పిలుస్తారు. భారతీయ సినీ నిర్మాత, దర్శకుడు, స్క్రీన్‌ప్లే రచయితగా పేరుపొందారు. 1870 లో జన్మించిన ఆయన 1944 లో కన్నుమూశారు. 1913లో భారతదేశ మొదటి సినిమా "రాజా హరిశ్చంద్ర"ను ఆయనే తెరకెక్కించారు. అక్కడి నుంచి మొదలైన మన ప్రయాణం నేడు ప్రపంచస్థాయి గుర్తించే దిశగా అడుగులేస్తుంది. దాదాసాహెబ్ ఫాల్కే భారత చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయడంలో చాలా కృషి చేశారు. ఆయన గౌరవార్థం భారత ప్రభుత్వం 1969లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఏర్పాటు చేసింది. భారత చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారంగా భావిస్తారు.

Rasi Phalalu: Daily Horoscope On 15-05-2025 In Telugu7
ఈ రాశి వారికి ముఖ్యమైన పనులలో విజయం.. ఉద్యోగలాభం

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: బ.తదియ రా.1.46 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: జ్యేష్ఠ ప.12.26 వరకు, తదుపరి మూల, వర్జ్యం: రా.8.58 నుండి 10.40 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.48 నుండి 10.39 వరకు, తదుపరి ప.2.55 నుండి 3.46 వరకు, అమృతఘడియలు: లేవు; రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం: 5.32, సూర్యాస్తమయం: 6.19. మేషం.. పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. అనారోగ్య సూచనలు. దైవదర్శనాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.వృషభం.... ముఖ్యమైన పనులలో విజయం. ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో సఖ్యత. విందువినోదాలు. వాహన, గృహయోగాలు. నూతన ఉద్యోగలాభం. వ్యాపార, ఉద్యోగాలలో ఉన్నతి.మిథునం... నిరుద్యోగులకు అనుకూల సమాచారం. విందువినోదాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. పనులలో పురోగతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది.కర్కాటకం... రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు.సింహం.... కుటుంబసభ్యులతో వైరం. అనారోగ్యం. బంధువులతో విభేదాలు. శ్రమ పెరుగుతుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. ఆధ్యాత్మిక చింతన.కన్య.... రుణాలు తీరతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో పురోగతి. నూతన ఒప్పందాలు. చర్చలు సఫలం. విందువినోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.తుల... ప్రయాణాలు వాయిదా వేస్తారు. భూవివాదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. మిత్రుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.వృశ్చికం... విద్యార్థులు సత్తా నిరూపించుకుంటారు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.ధనుస్సు.. ముఖ్య పనులు వాయిదా. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆరోగ్యపరంగా చికాకులు. దూరప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చిక్కులు.మకరం... పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. విందువినోదాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.కుంభం... కొత్త విషయాలు తెలుసుకుంటారు. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. భూవివాదాలు పరిష్కారం. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.మీనం... వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

Chandrababu govt Red Book conspiracy exposed once again8
రిమాండ్‌ నివేదిక సాక్షిగా.. బాబు భేతాళ కుట్రే...!

సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు రెడ్‌బుక్‌ కుట్ర మరోసారి బట్టబయలైంది. టీడీపీ వీరవిధేయ పోలీసు అధికారులతో నియమించుకున్న సిట్‌ ద్వారా సాగిస్తున్న కుతంత్రం న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్‌ నివేదిక సాక్షిగా బయటపడింది. దర్యాప్తు, ఆధారాలు తదితర న్యాయపరమైన విధానాలతో నిమిత్తం లేకుండా ఏకపక్షంగా సాగిస్తున్న కుతంత్రం మరోసారి వెలుగుచూసింది. టీడీపీ ప్రధాన కార్యాలయంలో అవాస్తవాలు, అభూత కల్పనలతో రూపొందించిన నివేదికలనే సిట్‌ తన రిమాండ్‌ నివేదికలతో సమర్పించి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు బరితెగిస్తోందని ఆధారాలతో సహా వెల్లడైంది. ఈ అక్రమ కేసులో సిట్‌ తాజాగా అరెస్టు చేసిన అంతర్జాతీయ సిమెంట్‌ దిగ్గజ కంపెనీ వికాట్‌ డైరెక్టర్‌ బాలాజీ గోవిందప్ప రిమాండ్‌ నివేదిక ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేసింది. ఇప్పటికే రాజ్‌ కేసిరెడ్డి చెప్పని విషయాలు చెప్పినట్టుగా ఆయన పేరిట అబద్ధపు వాంగ్మూలంతో రిమాండ్‌ నివేదిక రూపొందించి సిట్‌ అడ్డంగా దొరికిపోయింది. ఆ వాంగ్మూలంపై ఆయన సంతకం చేసేందుకు నిరాకరించారని సిట్‌ అధికారులే న్యాయస్థానానికి వెల్లడించాల్సి వచ్చింది. అయినా సరే సిట్‌ తీరు ఏమాత్రం మారలేదు. ఈ కేసులో తాజాగా బాలాజీ గోవిందప్ప రిమాండ్‌ నివేదికలోనూ అదే అబద్ధపు వాంగ్మూలాల కుతంత్రానికి తెగబడింది. కర్ణాటకలో మంగళవారం అరెస్టు చేసిన ఆయన్ను సిట్‌ అధికారులు బుధవారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆయనకు ఈ నెల 20 వరకు రిమాండ్‌ విధించింది. మరోవైపు టీడీపీ ప్రభుత్వ కుట్రలను సవాల్‌ చేస్తూ ఈ కేసులో అరెస్టైన రాజ్‌ కేసిరెడ్డి కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అరెస్టు అక్రమమని, చట్ట విరుద్ధమని నివేదించింది. దీనిపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణలో అరెస్టుకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తామని ప్రకటించింది.బాలాజీ గోవిందప్పతో సిట్‌ అధికారులు పలు పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించారని న్యాయస్థానానికి సమరి్పంచిన మెమోలో పేర్కొన్న భాగం గోవిందప్పతో బలవంతంగా సంతకాలు చేయించిన సిట్‌చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్‌ కుట్రతోనే ఈ అక్రమ కేసులో బాలాజీ గోవిందప్పను నిందితుడిగా చేర్చారన్నది వెల్లడైంది. ఆయన పేరిట అవాస్తవాలతో సిట్‌ అధికారులే అబద్ధపు వాంగ్మూలం నమోదు చేసేశారు. ఆ వాంగ్మూల పత్రంపై సంతకం చేసేందుకు బాలాజీ గోవిందప్ప నిరాకరించారని.. ఆయనతో పోలీసులు బలవంతంగా కొన్ని పత్రాలపై సంతకాలు చేయించారని న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాల్లో స్పష్టంగా ఉండటం గమనార్హం. అంతేకాదు మూడో పార్టీకి చెందిన మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను సిట్‌ అధికారులు అక్రమంగా జప్తు చేశారన్నది కూడా వెలుగులోకి వచ్చింది. వాటిని ట్యాంపర్‌ చేయడం ద్వారా ఈ కేసులో తప్పుడు సాక్ష్యాలు సృష్టించాలన్నది సిట్‌ లక్ష్యమన్నది స్పష్టమవుతోంది. ఇదే విషయాలను బాలాజీ గోవిందప్ప తరపు న్యాయవాది ప్రత్యేక మెమో ద్వారా న్యాయస్థానం దృష్టికి తెచ్చారని కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. ఆ మెమోలో పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని న్యాయస్థానం సానుకూలంగా స్పందించడం కీలకంగా మారింది. ఇక బాలాజీ గోవిందప్ప ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ సుప్రీంకోర్టులో విచారణకు రానుందని తెలిసే... అంతకుముందే తెల్లవారు జామునే ఆయన్ను అక్రమంగా అరెస్టు చేశారని గోవిందప్ప న్యాయవాది న్యాయస్థానానికి నివేదించారు. సిట్‌లో సభ్యుడుకాని అనంతపురం రూరల్‌ డీఎస్పీ వెంకటేశ్వర్లుకు ఎలాంటి అధికారం లేనప్పటికీ బాలాజీ గోవిందప్పను అక్రమంగా అరెస్ట్‌ చేశారని కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. సిట్‌ పూర్తిగా అవాస్తవాలు, అభూతకల్పనలతో బాలాజీ గోవిందప్ప రిమాండ్‌ నివేదికను రూపొందించి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు యత్నించింది.అరెస్టుకు ముందే రిమాండ్‌ నివేదికలా..!ఆ నివేదిక కుట్రే... ఇదిగో సాక్ష్యం...ఇక నిందితుల అరెస్టు, విచారణతో నిమిత్తం లేకుండానే టీడీపీ కార్యాల­యంలోనే రిమాండ్‌ నివేదికలు రూపొందిస్తున్న కుట్రలు బట్టబయ­లయ్యాయి. బాలాజీ గోవిందప్ప రిమాండ్‌ నివేదికే ఈ విషయాన్ని వెలు­గులోకి తెచ్చింది. ఆయన అరెస్టుకు కారణాలను వెల్లడిస్తూ... నిందితుడు పెళ్ల­కూరు కృష్ణమోహన్‌రెడ్డి ఇతరులు అవినీతికి పాల్పడ్డారు అని పేర్కొంది. అసలు బాలాజీ గోవిందప్ప అరెస్టుపై రిమాండ్‌ నివేదికలో కృష్ణమోహన్‌రెడ్డి పేరును ఎందుకు ప్రస్తావించినట్టు..? అంటే నిందితుల అరెస్టులతో నిమిత్తం లేకుండానే ముందుగానే టీడీపీ ఆఫీసులోనే రిమాండ్‌ నివేదికలు రూపొందించి.. వాటిని కాపీ, పేస్ట్‌ చేస్తూ న్యాయస్థానానికి సమర్పిస్తున్నట్టు వెల్లడైంది.ఎవరినైనా ఇరికిస్తాం..!బాలాజీ గోవిందప్ప వైఎస్‌ జగన్‌ దగ్గర పనిచేస్తున్నట్లు రిమాండ్‌ రిపోర్టులో రాశారు. కానీ ఆయన వైఎస్‌ జగన్‌ సంస్థల్లో పని చేయట్లేదు. 12 దేశాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ దిగ్గజ కంపెనీ వికాట్‌లో పూర్తి స్థాయి డైరెక్టర్‌గా ఉన్నారు. భారతీ సిమెంట్స్‌లో మెజార్టీ వాటాను వికాట్‌ ఎప్పుడో కొనుగోలు చేసింది. వైఎస్‌ జగన్‌ కుటుంబ సభ్యులకు కంపెనీలో మైనార్టీ షేర్‌ మాత్రమే ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికారులతో గోవిందప్ప చాలా సన్నిహితంగా మెలిగి కుట్రలకు పాల్పడ్డారని రిపోర్టులో రాశారు. ఆయన ఎప్పుడూ హైదరాబాద్‌లోనే ఉంటారు. ఏపీకి రావడం చాలా తక్కువ. వృత్తిరీత్యా చార్టెడ్‌ అక్కౌంటెంట్‌ అయిన గోవిందప్పకు నిరంతరం ఊపిరి సలపని పనులు ఎన్నో ఉంటాయి. ఓ అంతర్జాతీయ దిగ్గజ కంపెనీ హోల్‌టైమ్‌ ఫైనాన్స్‌ డైరెక్టర్‌నే ఇలా టార్గెట్‌ చేసి అక్రమ కేసులో, జరగని కుంభకోణంలో ఇరికించారంటే.. ఇక దేశంలో ఎవరినైనా కేసుల్లో ఇరికించవచ్చు అనే సందేశాన్ని చంద్రబాబు సర్కారు పంపింది. దీన్నిబట్టి భేతాళ కుట్రలు మరోసారి నిరూపితమవుతున్నాయి.

Smartphone sales stagnate in rural India9
చిన్న నగరాల్లో స్మార్ట్‌ఫోన్స్‌ హవా!

మెట్రోలు, బడా నగరాల వంటి అర్బన్‌ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు పతాక స్థాయికి చేరుకోవడంతో డిమాండ్‌ మందకొడిగా మారింది. అయితే, హ్యాండ్‌సెట్‌ తయారీ సంస్థలకు ద్వితీయ శ్రేణి నగరాలు, గ్రామీణ ప్రాంతాలు ఇప్పుడు ఈ లోటును భర్తీ చేస్తున్నాయి. చౌక ఫోన్లే కాదు.. ప్రీమియం 5జీ ఫోన్ల కొనుగోళ్లకూ కస్టమర్లు తగ్గేదేలే అంటున్నారు. పెద్ద నగరాలను మించి విక్రయాలు నమోదవుతుండటంతో సేల్స్‌ పెంచుకోవడానికి కంపెనీలు రూరల్‌ రూట్‌ ఎంచుకుంటున్నాయి. అంతేకాదు, ఫైనాన్సింగ్‌ ఆప్షన్ల దన్నుతో సెకండ్‌ హ్యాండ్‌ 4జీ ఫోన్లు కూడా హాట్‌ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఒకప్పుడు కీప్యాడ్‌ ఫీచర్‌ ఫోన్స్‌ వాడకానికి బాగా అలవాటు పడ్డ గ్రామీణ, చిన్న పట్టణాల ప్రజలు ‘స్మార్ట్‌’గా అప్‌గ్రేడ్‌ అవుతున్నారు. దీంతో చిన్న నగరాలు, పట్టణాలతో పాటు పల్లెల్లోనూ స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్‌ దూసుకెళ్తోంది. పెద్ద నగరాల్లో స్తబ్దుగా మారిన సేల్స్‌ను కంపెనీలు అక్కడ పూడ్చుకుంటున్నాయి. దీంతో మొత్తంమీద స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు పడిపోకుండా, వృద్ధి సిగ్నల్స్‌కు వీలవుతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ‘4జీతో పాటు 5జీ మోడల్స్‌ కూడా అందుబాటు ధరల్లో లభ్యమవుతుండటంతో ద్వితీయ శ్రేణి నగరాల్లో ఈ ఏడాది అమ్మకాల వృద్ధి భారీగా నమోదుకానుందని టెక్‌ఆర్క్‌ అడ్వయిజర్‌ అజయ్‌ శర్మ చెప్పారు. ‘2023, 2024 సేల్స్‌ ట్రెండ్‌ను పరిశీలిస్తే, పెద్ద నగరాలకు మించి టియర్‌–2 నగరాల్లో అమ్మకాలు పుంజుకున్నాయి. ప్రీమియం ఫోన్ల పట్ట ఆసక్తి ఈ నగరాలకూ పాకింది. మరోపక్క, చౌక 5జీ ఫోన్ల దన్నుతో కొన్ని బ్రాండ్‌లు మిగతా కంపెనీల కంటే వేగంగా వృద్ధి చెందుతున్నాయి’ అని పేర్కొన్నారు.ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌ ద్వారా... చిన్న నగరాలు, పట్టణాల్లో కూడా ప్రజల ఆదాయాలు పెరుగుతుండటంతో పాటు డిజిటల్‌ టెక్నాలజీ పట్ల అవగాహన, రిటైల్‌ నెట్‌వర్క్‌లను విస్తరిస్తుండటం వల్ల కస్టమర్లు హై–ఎండ్‌ డివైజ్‌లకు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ ఎనలిస్ట్‌ సుభమ్‌ సింగ్‌ తెలిపారు. ‘ప్రధాన హ్యాండ్‌సెట్‌ బ్రాండ్‌లన్నీ ఆఫ్‌లైన్‌ (రిటైల్‌ స్టోర్స్‌) ద్వారా చిన్న నగరాల్లోకి చొచ్చుకుపోతున్నాయి. ఇంటర్నేషనల్‌ డేటా కార్పొరేషన్‌ (ఐడీసీ) గణాంకాల ప్రకారం 2024లో 15.1 కోట్ల స్మార్ట్‌ఫోన్‌లు అమ్ముడయ్యాయి. 4 శాతం వృద్ధి నమోదైంది. స్టోర్‌లో నేరుగా ఫోన్‌ను చూసి, అనుభూతి చెందే అవకాశం, అలాగే ఈజీ ఫైనాన్సింగ్‌ ఆప్షన్లతో ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ కొనుగోళ్లకు వెనకాడటం లేదు’ అని సింగ్‌ వివరించారు. 30 నగరాల్లో నిర్వహించిన మార్కెట్‌ అధ్యయనం ప్రకారం, బడా నగరాల్లో (టియర్‌–1) వార్షిక అమ్మకాల వృద్ధి సింగిల్‌ డిజిట్‌కు పరిమితం కాగా, టియర్‌–2, అంతకంటే చిన్న నగరాల్లో రెండంకెల వృద్ధి నమోదవుతున్నట్లు చెప్పారు. ఫీచర్‌ ఫోన్స్‌ కస్టమర్లు అప్‌గ్రేడ్‌ అవుతుండటం, అనువైన రుణ సదుపాయాల వల్ల తృతీయ శ్రేణి (టియర్‌–3) ప్రాంతాల్లో తమ అమ్మకాలు 19–20 శాతం పెరిగాయని హ్యాండ్‌సెట్‌ బ్రాండ్‌ టెక్నో సీఈఓ అరిజిత్‌ తలపాత్ర పేర్కొన్నారు.అమ్మకాలు ఫ్లాట్‌.. ఆదాయాలు జూమ్‌ కోవిడ్‌ ముందు నాటి స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాల వృద్ధితో పోలిస్తే ప్రస్తుతం దేశంలో సేల్స్‌ మందగమనం స్పష్టంగా కనబడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఏటా విక్రయాలు 15 కోట్ల స్థాయికి పరిమితం అవుతున్నాయి. ఈ ఏడాది (2025) అమ్మకాలు ఫ్లాట్‌గా ఉంటాయని అంచనా వేస్తున్నారు. టాప్‌లేపుతున్న వివో, శాంసంగ్, షావోమి, ఒప్పో, రియల్‌మీ వంటి బ్రాండ్‌లకు ఇది ప్రతికూల సిగ్నల్స్‌ పంపుతోంది. అయితే, 2024లో దేశీ స్మార్ట్‌ఫోన్‌ పరిశ్రమ మొత్తం ఆదాయం ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి (9% వార్షిక వృద్ధి) దూసుకెళ్లడం విశేషం. ప్రధానంగా 5జీ, జెనరేటివ్‌ ఏఐ వంటి ఫీచర్లు గల ఖరీదైన స్మార్ట్‌ఫోన్స్‌పై కస్టమర్లు భారీగా ఖర్చు చేయడమే దీనికి కారణమని కౌంటర్‌పాయింట్‌ వెల్లడించింది.సగం ఫోన్‌ సేల్స్‌ అక్కడి నుంచే... ‘ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల వాడకం ట్రెండ్‌ మెట్రోలు, పెద్ద నగరాలకే పరిమితం కావడం లేదు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కూడా రూ.8,500–17,000 స్థాయికి మించి ఖరీదైన ఫోన్లకు కస్టమర్లు సై అంటున్నారు. ముఖ్యంగా ఔత్సాహిక మధ్య తరగతి కొనుగోలుదారులు వేగంగా ప్రీమియం ఫోన్లకు అప్‌గ్రేడ్‌ అవుతున్నారు’ అని సీసీఎస్‌ ఇన్‌సైట్‌ సీనియర్‌ ఎనలిస్ట్‌ ఏక్తా మిట్టల్‌ చెప్పారు. స్మార్ట్‌ఫోన్‌ పరిశ్రమలో భవిష్యత్తు వృద్ధికి చిన్న నగరాలే చోదకంగా నిలుస్తాయంటున్నారు. ప్రస్తుతం సగానికి పైగా స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు చిన్న నగరాలు, పట్టణాల్లోనే నమోదవుతున్నాయని కూడా సీసీఎస్‌ ఇన్‌సైట్‌ తెలిపింది. మరోపక్క, జియో, ఎయిర్‌టెల్‌ తమ 5జీ నెట్‌వర్క్‌ను గ్రామీణ, సబర్బన్‌ ప్రాంతాలకు వేగంగా విస్తరిస్తుండటం, క్వాల్‌కామ్, మీడియాటెక్‌ వంటి చిప్‌ తయారీ దిగ్గజాలు రూ.12,000 కంటే తక్కువ స్థాయిలో 5జీ ఫోన్లు లభించేలా చౌక 5జీ ప్రాసెసర్లను అందుబాటులోకి తేవడం కూడా పరిశ్రమకు దన్నుగా నిలుస్తోందనేది నిపుణుల మాట!–సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

India Successfully Tests New Counter-drone System Bhargavastra10
భార్గవాస్త్రం సిద్ధం

న్యూఢిల్లీ: ప్రత్యర్థి దేశాల డ్రోన్లు, మానవ రహిత గగనతల వాహనాలను తుత్తునియలు చేసే స్వదేశీ కౌంటర్‌–డ్రోన్‌ సిస్టమ్‌ ‘భార్గవాస్త్ర’ను భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. ఆధునిక యుద్ధాల్లో డ్రోన్ల రూపంలో ఎదురవుతున్న ముప్పును సమర్థంగా తిప్పికొట్టడంలో గొప్ప ముందడుగు వేసింది. సోలార్‌ డిఫెన్స్‌ అండ్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌(ఎస్‌డీఏల్‌) అభివృద్ధి చేసిన ఈ డ్రోన్ల నిరోధక వ్యవస్థను ఒడిశా రాష్ట్రం గోపాల్‌పూర్‌లోని సీవార్డ్‌ ఫైరింగ్‌ రేంజ్‌లో ఆర్మీ ఎయిర్‌ డిఫెన్స్‌(ఏఏడీ) అధికారుల సమక్షంలో మంగళవారం పరీక్షించారు. మొత్తం మూడు ట్రయల్స్‌ నిర్వహించగా, అన్నీ విజయవంతమయ్యాయి. ఎక్కడా గురి తప్పలేదు. ‘భార్గవాస్త్ర’లోని నాలుగు మైక్రో రాకెట్లు అన్ని నిర్దేశిత లక్ష్యాలను ఛేదించాయి. తొలుత రెండు రాకెట్లను వేర్వేరుగా ఫైర్‌ చేశారు. దాంతో రెండు ట్రయల్స్‌ పూర్తయ్యాయి. మూడో ట్రయల్‌లో భాగంగా.. మరో రెండు రాకెట్లను ఒకేసారి సాల్వో మోడ్‌లో కేవలం రెండు సెకండ్ల వ్యవధిలోనే పరీక్షించారు. నాలుగు రాకెట్ల పనితీరూ అద్భుతంగా ఉన్నట్లు తేలింది. అవి నిర్దేశిత లాంచ్‌ పారామీటర్లను సాధించాయి. భారీ డ్రోన్లతో దాడులు జరిగినప్పుడు వాటిని గురిపెట్టి కచ్చితంగా నేలకూల్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్‌ సొంతం చేసుకుంది. పాకిస్తాన్‌ ఉగ్రవాదులపై ‘ఆపరేషన్‌ సిందూర్‌’ ప్రారంభించిన కొన్ని రోజులకే భార్గవాస్త్రను విజయవంతంగా పరీక్షించడం ప్రాధాన్యం సంతరించుకుంది. → భార్గవాస్త్రలో మొదటి దశలో ఆన్‌గైడెడ్‌ మైక్రో రాకెట్లు ఉంటాయి. ఇవి శత్రుదేశాల డ్రోన్లను కూల్చివేస్తాయి. → ఇక రెండో దశలో గైడెడ్‌ మైక్రో మిస్సైల్‌ ఉంటుంది. ఇది పిన్‌పాయింట్‌ కచ్చితత్వంతో ప్రత్యర్థి డ్రోన్లను చిత్తుచేస్తుంది. శత్రువు డ్రోన్లు తప్పించుకొనే అవకాశమే ఉండదు. గైడెడ్‌ మైక్రో మిస్సైల్‌ను గతంలోనే పరీక్షించారు. → అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో సమర్థంగా పనిచేసేలా భార్గవాస్త్రను అభివృద్ధి చేశారు. సముద్ర మట్టానికి 5 కిలోమీటర్లకుపైగా ఎత్తులోనూ చక్కగా పనిచేయగలదు. భారత సైనిక దళాల అవసరాలను అనుగుణంగా రూపొందించారు. → పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో, చాలా తక్కువ ఖర్చుతో భార్గవాస్త్రను డిజైన్‌ చేయడం విశేషం. త్రివిధ దళాల అవసరాల మేరకు ఇందులో అదనంగా మార్పుచేర్పులు చేసుకోవచ్చని ఎస్‌డీఏఎల్‌ వెల్లడించింది. → అడ్వాన్స్‌డ్‌ సీ4ఐ(కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్స్, ఇంటెలిజెన్స్‌) టెక్నాలజీతో భార్గవాస్త్ర పనిచేస్తుంది. గగనతలంలో ఎదురయ్యే ముప్పును రియల్‌–టైమ్‌లో ఎప్పటికప్పుడు గుర్తించవచ్చు. → ఇందులోని రాడార్‌ 6 నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని డ్రోన్లను గుర్తించగలదు. అలాగే ఎలక్ట్రో ఆప్టికల్‌/ఇన్‌ఫ్రారెడ్‌(ఈఓ/ఐఆర్‌) సెన్సార్లు ‘లో రాడార్‌ క్రా–సెక్షన్‌’ లక్ష్యాలను కనిపెట్టగలవు. → కౌంటర్‌–డ్రోన్‌ టెక్నాలజీలో భార్గవాస్త్ర ఒక మైలురాయి అని ఎస్‌డీఏఎల్‌ అధికారులు చెబుతున్నారు. → కొన్ని దేశాలు భార్గవాస్త్ర తరహాలో మైక్రో–మిస్సైల్‌ సిస్టమ్స్‌ను రూపొందించినప్పటికీ... పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో, తక్కువ ఖర్చుతో ఇలాంటి బహుళ దశలతో కూడిన కౌంటర్‌–డ్రోన్‌ వ్యవస్థను ఎవరూ తయారు చేయలేకపోయారు. → భార్గవాస్త్రను హార్డ్‌కిల్‌ మోడ్‌లో రూపొందించారు. భారీ డ్రోన్లతోపాటు చాలా చిన్నస్థాయి డ్రోన్లను కూడా గుర్తించి, కూల్చివేయగలదు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement