బాగ్దాద్: ఇరాక్లో ట్రక్ బాంబు పేలుళ్లకు పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ముందుముందు ఇలాంటివి చాలా ఉంటాయన హెచ్చరించింది. గురువారం ఉదయం బాగ్దాద్లోని మార్కెట్ ప్రాంతంలో ఓ ట్రక్కు బాంబు పేలుడు సంభవించి మొత్తం 50 మంది ప్రాణాలు కోల్పోగా 200 మంది గాయాలపాలయ్యారు.
తొలుత ఈ బాంబు పేలుళ్లకు కారణం ఎవరనే విషయం తేలలేదు. ఈ లోగానే నేరుగా ఇస్లామిక్ స్టేట్ ఆన్ లైన్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ మారణ హోమం చేసింది తామేనని స్పష్టం చేసింది. మృతుల సంఖ్యమరింత పెరిగే అవకాశం ఉంది.
'ఆ మారణ హోమం మాదే'
Published Thu, Aug 13 2015 4:41 PM | Last Updated on Sun, Sep 3 2017 7:23 AM
Advertisement
Advertisement