Ukraine's two breakaway regions announced a general mobilisation: ఉక్రెయిన్ నుంచి విడిపోయిన రెండు ప్రాంతాల వేర్పాటువాద నాయకులు శనివారం యుద్ధానికి సిద్దం అని ప్రకటించారు. దీంతో ఉక్రెయిన్‌లో రష్యా ఆక్రమణ దాడులు మరింత తీవ్రతరం అవుతాయనే భయాలు మొదలయ్యాయి. యూరప్‌లోని ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్ నిపుణులు రష్యా అనుకూల తిరుగుబాటుదారులచే నియంత్రించబడుతుందని, తూర్పు ఉక్రెయిన్‌లోని కొన్ని భాగాలలో దాడులు గణనీయంగా పెరిగాయని నివేదిక ఇచ్చిన కొద్ది వ్యవధిలోనే ఈ ప్రకటనలు వెలువడటం గమనార్హం.
ఈ మేరకు శనివారం తాజాగా జరిగిన దాడులపై ఇరు వర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. డొనెట్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ నాయకుడు డెనిస్ పుషిలిన్ తన తోటి సైనికులను సైనిక నిర్భంధ కార్యాలయానికి రావాలని కోరడమే కాక తాము యుధ్దానికి సిధ్దం అనే డిక్రి పై సంతకం చేసిన విషయం గురించి ఒక వీడియోలో వెల్లడించారు. లుగాన్స్ వేర్పాటువాద ప్రాంతం నాయకుడు లియోనిడ్ పసెచ్నిక్, అదే సమయంలో తన ప్రాంతంలోని దాడులను తిప్పికొట్టేందుకు సిద్ధం అని సంతంకం చేసిని డిక్రిని ప్రచురించాడు.
అయితే ఉక్రెయిన్ భద్రతా దళాలే దాడులు మొదలుపెట్టాయని.. తాము ఆ దాడులను అడ్డుకున్నామని వేర్పాటువాద నాయకుడు పుషిలిన్ పేర్కొన్నాడు. అంతేకాదు తాము కలిసి విజయాన్ని సాధించడమే కాక రష్యా ప్రజలను రక్షిస్తాం అని ప్రకటించాడు. మరోవైపు వాషింగ్టన్ కూడా ఏ క్షణంలోనే రష్యా దాడులు చేస్తోందంటూ హెచ్చరిస్తోంది. ఇవన్నీ ఉక్రెయిన్‌ని ప్రధానంగా భయపెడుతున్న అంశాలు. 2014లో రష్యాలో విలీనం అయిన క్రిమియన్ ద్వీపకల్పాన్ని స్వాధీనం చేసుకునే నిమిత్తం ఉక్రెయిన్ వేర్పాటు వాదులపై దాడులు జరుపుతోందంటూ వస్తున్న ఆరోపణలను ఉక్రెయిన్ రాజధాని కీవ్ ఖండించింది. అంతేకాదు 2014లో వేర్పాటు దారులు చేసిన దాడులలో ఉక్రెయిన్ సైన్యం సుమారు 14 వేల మంది చనిపోయారు.
మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం బలగాలు వెనుకకు వచ్చేసినట్లు చెబుతుండటం విశేషం. ఉపగ్రహ చిత్రాలలో ఉక్రెయిన్ చుట్టూ రష్యా దళాలు మోహరింపు స్పష్టంగా కనిపిస్తోంది.బెలారస్, క్రిమియా, పశ్చిమ రష్యాలోని అనేక కీలక ప్రదేశాలలో రష్యా సైన్యం కార్యకలాపాల పరిధిని కొత్త ఉపగ్రహ చిత్రాలు చూపిస్తున్నాయి. అయితే ఉక్రెయిన్ ఎప్పటికీ నాటోలో చేరదని హామీ పై బలగాలను వెనుక్కుతగ్గుతాయని రష్యా చెప్తుండడం తెలిసిందే.
(చదవండి: : రష్యా అణు విన్యాసాలు)
Comments
Please login to add a commentAdd a comment