mobilisation
-
సైనిక బలగాల మోహరింపు అట్టర్ ప్లాప్...షాక్‌లో పుతిన్
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఒక్కరోజులోనే దాదాపు వెయ్యిమంది రష్యా బలగాలు మృతి చెందినట్లు ఉక్రెయిన్ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఫిబ్రవరిలో దురాక్రమణ యుద్ధానికి దిగినప్పటి నుంచే దాదాపు 71, 200 మందికి పైగా రష్యా బలగాలు మృతి చెందినట్లు ఉక్రెయిన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ పేర్కొంది. అదీగాక కేవలం ఒక్క ఆదివారం నాడే సుమారు 950 మంది నెలకొరిగారని వెల్లడించింది. ఉక్రెయిన్ దళాలు కీలకమైన దక్షిణ నగరంలోని ఖైర్సన్ వైపుగా ముందుకు సాగుతున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్ స్కీ వెల్లడించారు. అదీగాక ఇటీవల పెద్ద సంఖ్యలో సైనిక మొబైలైజేషన్ చేసింది. కానీ ఆ బలగాలు మాస్కో పంపిన రిజర్వ్స్ట్ పరికరాలతో సమస్యలను ఎదుర్కొనడమే గాక పోరాడే సన్నద్ధత లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు యూకే మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇటీవల పెద్ద సంఖ్యలో రిక్రూట్ చేసుకున్న సైనికులు చాలా పేలవంగా పోరాడుతున్నట్లు కూడా వెల్లడించింది. మరికొంత మంది రిజర్వ్ బలగాలు ఆయుధాలు లేకుండా మోహరించడం వంటివి చేస్తున్నారంటూ స్వయంగా రష్యా అధికారులే తలలు పట్టుకుంటున్నట్లు పేర్కొంది. అదీగాక మాస్కో బలగాలు 1959 నాటి ఏకేఎం రైఫిల్స్ వాడుతున్నట్లు తెలిపింది. పేలవమైన నిల్వ ఆయుధాల కారణంగానే వేలాదిమంది సైనికులు యుద్ధంలో పోరాడ లేక నెలకొరుగుతున్నట్లు యూకే రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయినప్పటికీ రష్యా తన దూకుడును తగ్గించకపోగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ ప్రాంతంలో పౌర సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని మాస్కో దాడులు కొనసాగిస్తుండటం గమనార్హం. (చదవండి: రష్యా సైన్యంలోకి అఫ్గాన్ కమాండోలు) -
ఉక్రెయిన్‌ని నివారించేలా రష్యా ఎత్తుగడ.. పశ్చిమ దేశాలకు స్ట్రాంగ్ వార్నింగ్
Military mobilisation: గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్ దళాలు రష్యా బలగాలపై పైచేయి సాధిస్తూ...రష్యా ఆక్రమిత ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో రష్యా అధ్యక్షుడు బహిరంగంగా మరిన్ని సైనిక సమీకరణలను చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు రష్యా తన భూభాగాలను రక్షించడానికి సుమారు రెండు మిలియన్ల బలమైన సైనిక దళాలను రంగంలోకి దింపనుందని అన్నారు. అలాగే పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌లో శాంతి కోరుకోవడం లేదని, రష్యాను నాశనం చేయాలని చూస్తున్నాయంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. తాను తమ మాతృభూమిని రక్షించుకోవడానికి, సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి సైనిక సమీకరణకై జనరల్ స్టాఫ్‌కి మద్దతు ఇవ్వాలని భావిస్తున్నానని చెప్పారు. అంతేగాదు తూర్పు ఉక్రెయిన్‌లో డాన్బాస్ ఇండస్ట్రీయల్ హార్ట్‌ల్యాండ్ ప్రాంతాన్ని విముక్తి చేయడమే తన లక్ష్యం అని పుతిన్ పునరుద్ఘాటించారు. అలాగే పశ్చిమ దేశాలు రష్యాపై అణు బ్లాక్‌మెయిల్‌కి దిగుతున్నాయని, దీనికి తాము తమ ఆయుధాలతో సరైన విధంగా బదులివ్వగలమని అన్నారు. ఇవేమి ప్రగల్పాలు, బెదిరింపులు కాదని తెగేసి చెప్పారు. అయినా రష్యా 2014లో ఉక్రెయిన్‌లో డోన్బాస్ ప్రాంతాన్ని ఆక్రమించుకుని లుహాన్స్క్, డోనెట్స్క్‌లను స్వతంత్ర రాష్ట్రాలుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. యుద్ధం మొదలైన ప్రాంభంలోనే దాదాపు 60 శాతం భూభాగాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకుంది రష్యా. జులై నాటికి మొత్తం లుహాన్స్క్ని స్వాధీనం చేసుకుంది. గత కొన్ని రోజులుగా ఖార్కివ్ ప్రావిన్స్ నుంచి రష్యా బలగాలు వెనక్కి మళ్లేలా చేశాయి ఉక్రెయిన్ సేనలు. దాదాపు రష్యా ఆక్రమించుకున్న ప్రాంతాలన్నింటిని కైవసం చేసుకుంది ఉక్రెయిన్. ఈ నేపథ్యంలోనే రష్యా అధ్యక్షడు పుతిన్ మరిన్ని బలగాలను మోహరింప చేసే దిశగా పావుల కదుపుతున్నాడు. (చదవండి: ఔను మోదీ చెప్పింది కరెక్ట్! ప్రశంసించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు) -
యుద్ధానికి బీ రెడీ!.. ఉక్రెయిన్ వేర్పాటువాదుల ప్రకటనతో ఉలిక్కిపాటు
Ukraine's two breakaway regions announced a general mobilisation: ఉక్రెయిన్ నుంచి విడిపోయిన రెండు ప్రాంతాల వేర్పాటువాద నాయకులు శనివారం యుద్ధానికి సిద్దం అని ప్రకటించారు. దీంతో ఉక్రెయిన్‌లో రష్యా ఆక్రమణ దాడులు మరింత తీవ్రతరం అవుతాయనే భయాలు మొదలయ్యాయి. యూరప్‌లోని ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్ నిపుణులు రష్యా అనుకూల తిరుగుబాటుదారులచే నియంత్రించబడుతుందని, తూర్పు ఉక్రెయిన్‌లోని కొన్ని భాగాలలో దాడులు గణనీయంగా పెరిగాయని నివేదిక ఇచ్చిన కొద్ది వ్యవధిలోనే ఈ ప్రకటనలు వెలువడటం గమనార్హం. ఈ మేరకు శనివారం తాజాగా జరిగిన దాడులపై ఇరు వర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. డొనెట్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ నాయకుడు డెనిస్ పుషిలిన్ తన తోటి సైనికులను సైనిక నిర్భంధ కార్యాలయానికి రావాలని కోరడమే కాక తాము యుధ్దానికి సిధ్దం అనే డిక్రి పై సంతకం చేసిన విషయం గురించి ఒక వీడియోలో వెల్లడించారు. లుగాన్స్ వేర్పాటువాద ప్రాంతం నాయకుడు లియోనిడ్ పసెచ్నిక్, అదే సమయంలో తన ప్రాంతంలోని దాడులను తిప్పికొట్టేందుకు సిద్ధం అని సంతంకం చేసిని డిక్రిని ప్రచురించాడు. అయితే ఉక్రెయిన్ భద్రతా దళాలే దాడులు మొదలుపెట్టాయని.. తాము ఆ దాడులను అడ్డుకున్నామని వేర్పాటువాద నాయకుడు పుషిలిన్ పేర్కొన్నాడు. అంతేకాదు తాము కలిసి విజయాన్ని సాధించడమే కాక రష్యా ప్రజలను రక్షిస్తాం అని ప్రకటించాడు. మరోవైపు వాషింగ్టన్ కూడా ఏ క్షణంలోనే రష్యా దాడులు చేస్తోందంటూ హెచ్చరిస్తోంది. ఇవన్నీ ఉక్రెయిన్‌ని ప్రధానంగా భయపెడుతున్న అంశాలు. 2014లో రష్యాలో విలీనం అయిన క్రిమియన్ ద్వీపకల్పాన్ని స్వాధీనం చేసుకునే నిమిత్తం ఉక్రెయిన్ వేర్పాటు వాదులపై దాడులు జరుపుతోందంటూ వస్తున్న ఆరోపణలను ఉక్రెయిన్ రాజధాని కీవ్ ఖండించింది. అంతేకాదు 2014లో వేర్పాటు దారులు చేసిన దాడులలో ఉక్రెయిన్ సైన్యం సుమారు 14 వేల మంది చనిపోయారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం బలగాలు వెనుకకు వచ్చేసినట్లు చెబుతుండటం విశేషం. ఉపగ్రహ చిత్రాలలో ఉక్రెయిన్ చుట్టూ రష్యా దళాలు మోహరింపు స్పష్టంగా కనిపిస్తోంది.బెలారస్, క్రిమియా, పశ్చిమ రష్యాలోని అనేక కీలక ప్రదేశాలలో రష్యా సైన్యం కార్యకలాపాల పరిధిని కొత్త ఉపగ్రహ చిత్రాలు చూపిస్తున్నాయి. అయితే ఉక్రెయిన్ ఎప్పటికీ నాటోలో చేరదని హామీ పై బలగాలను వెనుక్కుతగ్గుతాయని రష్యా చెప్తుండడం తెలిసిందే. (చదవండి: : రష్యా అణు విన్యాసాలు) -
పేదల పెన్నిధి రాజన్న
సాక్షి, మంచిర్యాల : విద్యార్థుల చదువులకు భరోసా ఇచ్చేందుకు ఫీజు రీయింబర్స్మెంట్, ఆడపడుచులకు పావలావడ్డీ, ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు 108,104, సాగు భూములకు జలకళ అందించేందుకు ప్రాజెక్టుల నిర్మాణం, వికలాంగులు, వృద్ధులు సకాలంలో పెన్షన్లు ఇవన్నీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మంచి పనుల్లోని కొన్ని అంశాలు.. మంగళవారం ఆ మహనీయుడి జయంతి. ఈ సందర్భంగా జిల్లావాసుల కోసం ఆయన చేసిన మంచి పనుల్లోని కొన్ని అంశాలు.. తెలంగాణ వరప్రదాయని ప్రాణహిత.. తెలంగాణలోని ఏడు జిల్లాల్లో 16.40 లక్షల ఎకరాలకు సాగు నీరందించిందాలనే బృహత్ లక్ష్యంతో వైఎస్ రాజశేఖరరెడ్డి మదిలో నుంచి ఆవిష్కృతమైందే ప్రాణ హిత-చేవెళ్ల ప్రాజెక్టు. రూ.38,500 కోట్ల వ్యయంతో 2008 డిసెంబరు 16న కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు. ఇన్వెస్టిగేషన్, మెబిలైజేషన్ చెల్లింపుల కింద రూ.1,025 కోట్లు ఖర్చు చేశారు. 2009లో దివంగత వైఎస్ మరణానంతరం ఈ ప్రాజెక్టుపై చిన్నచూపు ప్రారంభమైంది. 2010-11 బడ్జెట్లో రూ.700 కోట్లు కేటాయించి రూ.33.57 కోట్లు విడుదల చేశారు. 2011-12 బడ్జెట్లో ఆర్భాటంగా ’608.28 కోట్లు కేటాయించినా ఒక్క రూపాయి కూడా ప్రాజెక్టు కోసం ఖర్చు చేయలేదు. 2012-13లో రూ.1050 కోట్లు, 2013-14లో రూ.780 కోట్లు కేటాయించారు. ఈ విధంగా అరకొర నిధులతో పనులు జరగడంలేదు. కేవలం మూడు కిలోమీటర్ల పొడవున మాత్రమే పనులు చేపట్టారు. ఆదిలాబాద్‌కు ఆధునిక వైద్యం కనీస వైద్యానికి నోచుకోని ఆదిలాబాద్ ఆదివాసులకు ఆధునిక కార్పొరేట్ వైద్యం అందించేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి అందించిన మరో ఆపన్నహస్తం రిమ్స్. 2008లో రూ.128 కోట్ల నిధులతో రిమ్స్ నిర్మాణానికి వైఎస్ శంకుస్థాపన చేశారు. రోగం ఏదైనా తక్షణ సేవలు అందించే స్థాయిలో రిమ్స్ అలరారుతుండటంతో పేద రోగుల మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని చెప్పవచ్చు. రిమ్స్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆరోగ్యశ్రీ వార్డు వల్ల పేద రోగులు లబ్ధిపొందుతున్నారు. మరోవైపు రిమ్స్ మెడికల్ కాలేజీలో వైద్య విద్య పూర్తిచేసుకున్న వైద్యులు సమాజ సేవకు కదులుతున్నారు. ఆధునిక విద్యకు అందలం విద్యార్థులకు ఇన్షర్మేషన్ టెక్నాలజీ చదువుల కోసం తెలంగాణకు కేటాయించిన ట్రిపుల్ ఐటీ జిల్లాలోని చదువుల తల్లి నిలయమైన బాసరలో కొలువుదీరింది. విద్యార్థుల సాంకేతిక చదువులకోసం వైఎస్ ట్రిపుల్ ఐటీకి 2008లో పచ్చజెండా ఊపారు. ఆ ఆర్థిక సంవత్సరంలో రూ.400 కోట్లను బాసర ట్రిపుల్ ఐటీకి కేటాయించారు. దీంతో శరవేగంగా తరగతి గదులు, వసతి భవనాలు, క్యాంపస్‌లు ఏర్పాటయ్యాయి. మొదట్లో ఫ్రీ ప్యాబ్రికేటెడ్ పద్ధతిలో భవనాలు నిర్మించినప్పటికీ వైఎస్సార్ ప్రత్యేక శ్రద్ధతో నిధులు కేటాయించి పనులు పూర్తిచేయించారు. అయితే దివంగత వైఎస్ మరణానంతరం ట్రిపుల్ ఐటీలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. గోడు దూరం గోదావరి నదిపై 20 టీఎంసీల నీటిని నిల్వచేసేందుకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు రూపకల్పనకు రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. తద్వారా 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి రైతన్నలకు నీటి వసతి లేదనే గోడు దూరం చేసేందుకు కార్యచరణ రూపొందించారు. 2004 జూలైలో ఎల్లంపల్లి జలాశయ నిర్మాణానికి వైఎస్సార్ శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనుల కోసం రూ.408 కోట్లు మంజూరు చేశారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన 2 లక్షల రైతులకు సాగునీరు అందుతుంది. సాగునీటితోపాటు మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి మునిసిపాలిటీలకు గోదావరి తాగునీరు, ఎన్టీపీసీకి 6 టీఎంసీల నీరు, దండేపల్లి మండలం గూడెం వద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మించడం వైఎస్ ఆశయం. అయితే ఆయన మరణానంతరం పనులు నత్తనడకన సాగాయి. దాదాపుగా పూర్తి కావచ్చిన ఈ ప్రాజెక్టు త్వరలో ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. సంతృప్తికర స్థాయిలో పెన్షన్లు అర్హులైన వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు వైఎ స్సార్ పెన్షన్లు మంజూరు చేశారు. దీంతోపాటు వికలాం గులకు చెల్లించే పెన్షను మొత్తాన్ని రూ.200 నుంచి రూ. 500కు పెంచారు. వృద్ధులకు, వితంతువులకు అప్పటివరకు చెల్లిస్తున్న రూ.75 మొత్తాన్ని రూ.200 చెల్లించారు. ఈ విధంగా సంతృప్తకర స్థాయితోపాటు పెన్షన్ మొత్తం పెంపుతో పండుటాకులతో పాటు విధివంచిత వికలాం గులు, వితంతువుల కళ్లల్లో ఆనందం వెళ్లివిరిసింది. బడుగు విద్యార్థులకు భరోసా ఉన్నత విద్య అభ్యసించేందుకు ఫీజులు చెల్లించేందుకు వెనకబడిన వర్గాల కోసం ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు రాజశేఖర రెడ్డి. జిల్లాలో ఈ విధానం ద్వారా వేలాది విద్యార్థులు లబ్ధిపొందారు. ఎందరో విద్యార్థులు మెడిసిన్, ఇంజినీరింగ్, పీజీ వంటి తమ కలల కోర్సుల్లో విద్యాభ్యాసాన్ని పూర్తిచేసుకున్నారు. అయితే ఆ తర్వాతి కాలంలో రీయింబర్స్‌మెంట్‌పై విధించిన ఆంక్షలతో బడుగులకు భరోసా దూరమయింది. అందుకే ప్రభుత్వ గణాంకాలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. 2004-05 విద్యాసంవత్సరంలో జిల్లాలోని 14,744 మంది విద్యార్థులకు రూ.6,14,00,000 ఫీజు కింద ప్రభుత్వం చెల్లించింది. 2005-06లో 6,770 విద్యార్థుల కోసం రూ.3,63,00,000 చెల్లించారు. 2006-07 విద్యా సంవత్సరంలో 20,639 మంది విద్యార్థులకు రూ.7,12,00,000 చెల్లించారు. 2007-08లో 23,955 మంది విద్యార్థులకు రూ.11,64,00,000 సొమ్మును చెల్లించారు. 2008-09 విద్యాసంవత్సరంలో17,192 మంది విద్యార్థులకు 10,36,00,000 చెల్లించారు. 2009-10లో విద్యార్థులు ఫీజురీయింబర్స్ అర్హులు సంఖ్య పెరిగి17,364కు చేరినప్పటికీ క్రితం సంవత్సరం కంటే తగ్గించి రూ.7,30,00,000 కేటాయించారు. వీటితోపాటు వ్యవసాయానికి ఉచిత కరెంటు అందించి రైతన్నల కళ్లల్లో వెలుగురేఖలు నింపారు. దళితుల కోసం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల నుంచి దళిత కాలనీలకు ఉచిత విద్యుత్ సౌలభ్యాన్ని పునరుద్ధరించారు. రాజీవ్ పల్లెబాట, రాజీవ్ నగరబాట కార్యక్రమాల ద్వారా పుర, గ్రామ ప్రజల సమస్యలను క ళ్లారా చూసి వాటిని తీర్చేందుకు అధికారులతో ప్రతిపాదనలు స్వీకరించి నిధులు మంజూరు చేశారు.