నడిరోడ్డుపై విజయవాడ టీడీపీ నేతల రచ్చ | Conflicts Between TDP Leaders In Vijayawada | Sakshi
Sakshi News home page

వీధికెక్కిన విజయవాడ టీడీపీ.. 

Published Mon, Feb 22 2021 7:18 AM | Last Updated on Mon, Feb 22 2021 11:29 AM

Conflicts Between TDP Leaders In Vijayawada - Sakshi

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ‘23 మంది వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు గారు పార్టీలోకి తీసుకున్నారు. అంతకు ముందు వరకు రోజూ వాళ్లు ఆయన్ను బూతులు తిట్టారు. అయినా సరే తీసుకున్నాం. అలాగే జలీల్‌ఖాన్‌ చంద్రబాబును అప్పటి వరకు బూతులు తిట్టారు.. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?’ అంటూ టీడీపీకి చెందిన విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని శ్రీనివాస్‌ (నాని)ఇటీవల నడిరోడ్డుపై పార్టీ నాయకులు, కార్యకర్తల నడుమ చేసిన బహిరంగ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు నిలదీయడంతో కేశినేని తనదైన శైలిలో సమాధానమిచ్చారు. దీనిపై నెటిజనులు  ‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా’ అంటూ వ్యంగ్యంగా కామెంట్‌ చేస్తున్నారు.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 39వ డివిజన్‌ నుంచి టీడీపీ తరఫున కార్పొరేటర్‌ అభ్యరి్థగా బరిలో ఉన్నట్లు చెప్పుకుంటున్న కప్పగంతుల శివ స్థానికంగా ఏర్పాటు చేసుకున్న ఎన్నికల కార్యాలయ ప్రారంభోత్సవానికి ఎంపీ కేశినేని నాని విచ్చేశారు. నగర పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వర్గానికి చెందిన స్థానిక మాజీ కార్పొరేటర్‌ గుండారపు హరిబాబు తన మద్దతుదారులతో నాలుగు స్తంభాల సెంటర్‌లో ఎంపీని అడ్డుకున్నారు. 39వ డివిజన్‌ కార్పొరేట్‌ అభ్యరి్థగా హరిబాబు కుమార్తె పూజితను గతంలోనే ఎంపిక చేశారు. టీడీపీతో సంబంధంలేని వారికి టికెట్‌ ఎలా ఇస్తా్తరంటూ వాగ్వివాదానికి దిగారు. దీనికి సమాధానంగా గతంలో 23 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబునాయుడు ఎలా తీసుకున్నారో ఇప్పుడు తాను అలాగేనని తేల్చిపారేశారు.

ఎంపీ అమ్ముడుపోయారు: హరిబాబు 
కేశినేని నాని అమ్ముడుపోయారని హరిబాబు తన కుమార్తె, నాయకులతో కలిసి మీడియా సమక్షంలో తీవ్రారోపణలు చేశారు. పార్టీ హైకమాండ్‌ టికెట్టు తమకిచ్చిందని.. వైఎస్సార్‌లోకి వెళ్లినోళ్లకి టికెట్‌ ఇస్తామంటే ఒప్పుకునేది లేదన్నారు.

డివిజన్‌కు రూ.20 లక్షలు 
మాజీ మేయర్‌ కోనేరు శ్రీధర్, ఆయన భార్య మూడు పర్యాయాలు గెలిచిన డివిజన్‌ను తన కూతురు శ్వేత కోసం బెదిరించి లాగేసుకున్నారని హరిబాబు ఆరోపించారు. ఒక్కో డివిజన్‌ అభ్యర్థికి 15 నుంచి 20 లక్షలు ఖర్చవుతుందని చెప్పి, ఆ మొత్తాన్ని తాను ఇస్తానని ఎంపీ చెప్పారన్నారు. కేశినేని శ్వేతను మేయర్‌ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించలేదని స్పష్టంచేశారు.
చదవండి: పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం  
తుదిదశలోను టీడీపీ దాష్టీకం

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement