
సాక్షి, విజయవాడ: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బరి తెగించింది. ప్రజా మద్దతు లేకపోవడంతో టీడీపీ నేతల దౌర్జన్యాలకు పాల్పడ్డారు. ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికల్లో టీడీపీ నేతల రభస సృష్టించారు. టీడీపీ నేతల నిర్వాకంతో కొన్ని చోట్ల ఉద్రిక్తతలకు దారితీసింది. గ్రామాల్లో గొడవలు సృష్టించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేవిధంగా రెచ్చిపోయారు. వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై బెదిరింపులకు దిగారు.
కృష్ణా జిల్లా పామర్రు పెరిసేపల్లి పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. మాస్క్ పెట్టుకోలేదన్న నెపంతో వైఎస్సార్ సీపీ మద్దతుదారుడిపై టీడీపీ నేతలు దాడి చేశారు. కొత్త నిమ్మకూరులో టీడీపీ నేత బరితెగించారు. వృద్ధురాలితో బూత్‌లోకి వెళ్లి ఓటు వేసేందుకు టీడీపీ నేత ప్రయత్నించారు. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలంలో సర్పంచ్ అభ్యర్ధిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. కృష్ణపల్లి కేంద్రం వద్ద వైఎస్ఆర్‌సీపీ బలపరిచిన అభ్యర్ధిపై దౌర్జన్యానికి దిగారు.
(చదవండి: మాట వినకపోతే చంపేస్తాం.. బాబు పీఏ బెదిరింపులు..)
ఇదేం బరితెగింపురా నాయనా..!
Comments
Please login to add a commentAdd a comment