Russian President Vladimir Putin said No Prospects: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫ్రాన్స్, జర్మనీ, కైవ్‌లతో అంగీకరించిన కీలకమైన 2015 ప్రణాళిక ఒప్పందం ఉక్రెయిన్ వేర్పాటువాద వివాదాన్ని పరిష్కరించగలదని తాను ఇకపై భావించడం లేదని అన్నారు. అంతేకాదు 2015 మిన్స్క్ శాంతి ఒప్పందాల అమలుకు ఎటువంటి అవకాశాలు లేవని మేము అర్థం చేసుకున్నాం. బెలారస్ రాజధానిలో ఉక్రెయిన్ సైన్యం తూర్పున ఉన్న మాస్కో అనుకూల తిరుగుబాటుదారుల మధ్య పోరాటాన్ని ముగించడానికి అంగీకరించినట్లు పుతిన్ తన భద్రతా మండలికి తెలిపారు.
రష్యా భద్రతకు ముప్పు కలిగించేలా పాశ్చాత్య శక్తులు ఉక్రెయిన్‌తో ఉన్న మాస్కో వైరాన్ని ఉపయోగించుకుంటున్నాయంటూ ఆగ్రహం చెందారు. ఉక్రెయిన్ నుంచి విడిపోయిన రష్యా-మద్దతుగల ప్రాంతాల స్వాతంత్య్రాన్ని గుర్తించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. రష్యా ఇలా బహిరంగంగా మద్దతు ఇస్తే అస్థిరమైన శాంతి ప్రణాళికను భంగం వాటిల్లుతుంది.
ఒక రకంగా రష్యా నాటకీయంగా దాడిచేసే క్రమంలోని వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందన్న అనుమానాలకు తావిస్తోంది కూడా. రష్యా భూభాగంలోకి చొరబడిన ఐదుగురు ఉక్రెనియన్ విధ్వంసకారులను తమ బలగాలు అడ్డగించి చంపేశాయని, సరిహద్దు పోస్ట్‌పై ఉక్రెయిన్ షెల్ దాడి చేసిందని రష్యా ఆరోపణలు చేస్తోంది. అయితే కైవ్ వాటన్నింటిని ఖండించింది. నిజానికి మాస్కో అటువంటి ఆపరేషన్‌కు ఇప్పటికే పునాది వేస్తున్నట్లు కనిపించింది.
(చదవండి: పుతిన్- బైడెన్‌ల అత్యవసర భేటీ!)
Comments
Please login to add a commentAdd a comment