వాళ్లిద్దరి మధ్య విభేదాలా!.. మరోసారి నిరూపితమైంది | IPL 2021: Kohli Checks Rohit Sharma RCB vs MI Fans Troll Rift Reports | Sakshi
Sakshi News home page

Kohli-Rohit Rift: వాళ్లిద్దరి మధ్య విభేదాలా!.. మరోసారి నిరూపితమైంది

Published Mon, Sep 27 2021 6:22 PM | Last Updated on Mon, Sep 27 2021 6:39 PM

IPL 2021: Kohli Checks Rohit Sharma RCB vs MI Fans Troll Rift Reports - Sakshi

Courtesy: IPL Twitter

Virat Kohli And Rohit Sharma Conflicts.. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మల మధ్య  విభేదాలు ఉన్నాయంటూ కొంతకాలం కిందట వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే ఒక్కోసారి వీరిద్దరి ప్రవర్తన ఉండడంతో మీడియా వార్తలు రాసుకొచ్చేది. అది చూసి ఫ్యాన్స్‌ కూడా నిజమేనని భావించారు.  అయితే అవన్నీ తప్పుడు వదంతులని.. మా మధ్య అలాంటిదేం లేదని కోహ్లి, రోహిత్‌లు చూపించారు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో మ్యాచ్‌లు విజయం సాధించినప్పుడు.. ఇంగ్లండ్‌ వికెట్లు కోల్పోయినప్పుడు ఇద్దరు ఒకరినొకరు హగ్‌ చేసుకోవడం.. అభినందించుకోవడం చేశారు.
చదవండి: T20 World Cup 2021: సూర్య, ఇషాన్‌లు ఫామ్‌లో లేరు.. ఆ స్థానాల్లో వీరే కరెక్ట్‌


Courtesy: IPL Twitter

తాజాగా ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ఆదివారం ఆర్‌సీబీ, ముంబై మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై 54 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే మ్యాచ్‌ ముగిసిన తర్వాత కోహ్లి రోహిత్‌ వద్దకు వచ్చి మాట్లాడిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇద్దరు మాట్లాడుకుంటున్న సందర్భంలో ముఖాల్లో నవ్వులు పూయడం అభిమానులను సంతోషపరిచింది.  ఈ సందర్భంగా వారి ఫోటోను షేర్‌చేస్తూ ట్వీట్స్‌తో రెచ్చిపోయారు. '' ఎంతైనా కాబోయే కెప్టెన్‌..  కాబోయే కెప్టెన్‌ వద్దకు వచ్చి ప్రస్తుత కెప్టెన్‌ చర్చలు.. వారిద్దరి మధ్య విభేదాలు లేవనడానికి ఈ ఫోటోనే నిదర్శనం'' అంటూ కామెంట్స్‌ చేశారు.

చదవండి: "నువ్వు సూపరప్పా ఊతప్ప".. సీఎస్‌కే ప్లేయర్‌ క్రీడాస్పూర్తికి నెటిజన్లు ఫిదా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement