తణుకులో చికిత్స పొందుతున్న బాధితుడితో మాట్లాడుతున్న ఎస్సై
పశ్చిమగోదావరి, పెరవలి: శుభమా అని పెళ్ళి చేసుకుంటే భోజనాల దగ్గర జరిగిన చిన్న గొడవతో ఇరువర్గాలు కొట్టుకోవటంతో 12 మందికి స్వల్ప గాయాలయ్యాయి. పెరవలి ఎస్సై వి.జగదీశ్వరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తణుకు పాతూరుకు చెందిన వధువు తరుఫు బృందం, పెరవలి మండలం అజ్జరం గ్రామానికి చెందిన వరుడి ఇంటి వద్ద వివాహ వేడుకకు శుక్రవారం ఉదయం వచ్చారు.
పెళ్ళి తంతు ముగిసిన తరువాత భోజనాలు చేస్తుండగా బిర్యానీ గురించి మాటామాటా పెరిగి వధువు, వరుడి వర్గాలు పరస్పరం కొట్టుకున్నారు. ఈ దాడిలో వరుడి తరుఫున ఆరుగురికి, వధువు తరఫున ఆరుగురికి గాయాలయ్యాయి. పెళ్ళి మండపం వద్ద గొడవ జరుగుతోందని సమాచారం రావటంతో వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లారు. అప్పటికే ఇరువర్గాలు కొట్టుకోవటంతో గాయాలైన వారిని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇరువర్గాల ఫిర్యాదులపై కేసులు నమోదు చేసామని ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment