
పశ్చిమగోదావరి, ఆకివీడు: కోళ్ల పర్రు గ్రామంలో పెళ్లి భోజనాల కోసం శుక్రవారం రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. ఈ దుర్ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన గండికోట స్వామి వివాహం ఈ నెల 15న జరిగింది. 18న యానాల భోజనాలు సక్రమంగా జరగలేదని, ఎవరూ రాలేదని బంధువులైన గండికోట బుల్లయ్య, దుర్గ తదితరులు ఆరోపిస్తూ, పెళ్లి కొడుకు తల్లిదండ్రులను విమర్శించారు. అంతేకాకుండా వారిపై దౌర్జన్యం చేసి గాయపరిచారని ఎస్సై వీరభద్రరావు చెప్పారు. వారిని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment