ప్రతి ఒక్కరూ తమ పెళ్లిని జీవితంలో ఎప్పటికీ తీపి జ్జాపకంలా గుర్తిండిపోయేలా జరుపుకోవాలనుకుంటారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు అందరి సమక్షంలో వైభవంగా సంబరాలు చేసుకుంటారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రస్తుతం పెళ్లిళ్లలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈతరం యువత కొంచెం ట్రెండ్ మార్చి కొత్తగా ట్రై చేస్తున్నారు. మెహందీ పార్టీ, హల్దీ ఫంక్షన్, డ్యాన్స్‌లతో హడావిడీ చేస్తున్నారు.
.
తాజాగా ఓ కుంటుంబం తన కొడుకుని పెళ్లి వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వరుడిని పెళ్లి ఊరేగింపులో భాగంగా ద్వారకాతిరుమలలో కేరళ సంప్రదాయంలో వాయిద్యాలను ఏర్పాటు చేశారు. అంతేగాక పెళ్లి కుమారుడుని బాహుబలి సినిమాలో బళ్లాల దేవుడు సింహాసనంపై కూర్చోబెట్టారు. ఈ సింహాసనంపై వరుడు ఊరేగింపుగా వెళుతుంటే అక్కడున్న వారంతా అతన్ని ఆశ్చర్యంగా చూశారు. అయితే వరుడికుటుంబ సభ్యులు మాత్రం ఇలా తీసుకెళ్లినందుకు గర్వంగా ఫీలవుతున్నారు. తమ ఇంటి పెళ్లి సందడిలో ప్రత్యేకత ఉండాలని, అందుకే ఇలా నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
చదవండి: పెరుగు కోసం ట్రైన్ ఆపిన లోకో పైలట్, తరువాత ఏం జరిగిందంటే..
చదవండి: సెల్ఫీ పిచ్చి...జాలి పడాలా? మీరే చూడండి!
Comments
Please login to add a commentAdd a comment