పాఠశాలలో విద్యార్థినుల మధ్య వివాదం | Parents Fight While School Kids Conflicts Prakasam | Sakshi
Sakshi News home page

పాఠశాలలో విద్యార్థినుల మధ్య వివాదం

Published Thu, Jan 10 2019 12:35 PM | Last Updated on Thu, Jan 10 2019 12:35 PM

Parents Fight While School Kids Conflicts Prakasam - Sakshi

తీవ్రంగా గాయపడిన కరిముల్లా

ప్రకాశం, బల్లికురవ: పాఠశాలలో ఇద్దరు విద్యార్థినుల మధ్య వివాదం చెలరేగి చినికిచినికి గాలివానలా మారి గ్రామంలో తల్లిదండ్రుల మధ్య కొట్లాటకు దారితీసింది. ఈ సంఘటన మండలంలోని ముక్తేశ్వరంలో బుధవారం జరిగింది. అందిన సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు బల్లికురవ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుకుంటున్నారు. ఒక బాలిక మరొక బాలిక బ్యాగుపై అసభ్యంగా రాతలు రాసింది. రాసిన బాలికను ఉపాధ్యాయులు మందలించి ఇంటికి పంపారు. అంత వరకూ ఓకే. మరో బాలిక సాయంత్రం ఇంటికి వెళ్లి తన బ్యాగుపై అసభ్యంగా రాశారంటూ తండ్రికి చెప్పుకుని బాధిపడింది. గ్రామంలో ఇద్దరు బాలికల తండ్రుల మధ్య మాటామాటా పెరిగింది. దాడిలో ఓ బాలిక తండ్రి కరిముల్లాకు తీవ్ర గాయలయ్యాయి. దాడిలో పరస్పరం తోపులాటలో మరో బాలిక తండ్రి కాలేషా, అతని తల్లి షకినాబీకి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులు ముగ్గురూ అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. గ్రామంలోని ముస్లిం కాలనీలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement