నర్సీపట్నం రూరల్ సీఐ కార్యాలయంలో రాజీకి వచ్చిన అత్తా, కోడలు, మామ
కోటవురట్ల(పాయకరావుపేట): జల్లూరులోని కోడలు, అత్తా మామల వివాదం ఓ కొలిక్కి వచ్చింది. వైఎస్సార్‌సీపీ నాయకుడు చిటికిల తిరుమలరావు చొరవతో కోడలు, అత్తామామలు రాజీకొచ్చారు. జల్లూరులోని కోడలు రాజేశ్వరి, అత్తామామలు పైడితల్లి, కొండబాబుల వివాదం తెలిసిందే. కోడలిని అత్త ఇంటి నుంచి గెంటేయడంతో మహిళా సంఘాలు అండగా నిలిచాయి. అత్తవారింటిలోకి కోడలును పంపించేశారు. ఈ వివాదం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నాయకుడు తిరుమలరావు పోలీసు ఉన్నతాధికారులకు విషయాన్ని తెలిపి రాజీ కుదిర్చారు.
ఈమేరకు నర్సీపట్నం రూరల్ సీఐ కార్యాలయంలో సోమవారం అత్తా మామ, కోడలు మధ్య రాజీ చేశారు. భార్యాభర్తలు రాజేశ్వరి, శ్రీరామమూర్తికి జీవన భృతి కల్పించేందుకు తిరుమలరావు హామీ ఇవ్వడంతో కోడలు రాజీకి వచ్చింది. రూరల్ సీఐ రేవతమ్మ ఇరువురికి నిర్వహించిన కౌన్సెలింగ్ ఫలించింది. మహిళా సంఘాలు కూడా హర్షం వ్యక్తం చేశాయి. ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు సూర్యప్రభ, మహిళా సంఘ సభ్యులు గౌరీ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment