
సైరస్ మిస్త్రీని వెంటాడుతున్న కష్టాలు
ముంబై: టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీని కష్టాలు వెంటాడుతున్నాయి. కంపెనీకి చెందిన రహస్య విషయాలు వెల్లడించారని ఆరోపిస్తూ టాటా సన్స్ మంగళవారం ఆయనకు లీగల్ నోటీసు పంపించింది. టాటా గ్రూపు నియమావళి, గోప్యతను ఉల్లంఘించారని ఆరోపించింది. టాటా సన్స్ డైరెక్టర్‌గా మిస్త్రీ కీలక, రహస్య సమాచారాన్ని వెల్లడించారని నోటీసులో పేర్కొంది.
టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగించిన సంగతి తెలిసిందే. దిగ్గజ గ్రూప్‌ను ముందుకు నడిపించే విషయంలో సైరస్ మిస్త్రీపైనా, ఆయన సామర్ధ్యంపైనా నమ్మకం కోల్పోయినందునే బోర్డు ఉద్వాసన పలికిందని టాటా సన్స్ తాత్కాలిక చైర్మన్ రతన్ టాటా వ్యాఖ్యానించారు. ఆ తర్వాత టాటా గ్రూప్ సంస్థల బోర్డుల్లో డైరెక్టర్ హోదా నుంచి సైరస్ మిస్త్రీ వైదొలిగారు. టాటా మోటార్స్, ఇండియన్ హోటల్స్ సహా ఆరు లిస్టెడ్‌కంపెనీల బోర్డుల నుంచి వైదొలుగుతున్నట్లు మిస్త్రీ వెల్లడించారు.