ముంబై : టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నటరాజన్ చంద్రశేఖరన్ నియామకం అక్రమమని, గ్రూప్ చీఫ్‌గా సైరస్ మిస్త్రీ తిరిగి పగ్గాలు చేపట్టాలని నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) స్పష్టం చేసింది. టాటా గ్రూప్ తనను బోర్డు నుంచి తప్పించడాన్ని సవాల్ చేస్తూ మిస్త్రీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన క్రమంలో అప్పీల్‌పై తుది నిర్ణయం వెలువడేవరకూ షేర్లు విక్రయించాలని ఆయనను టాటా సన్స్ ఒత్తిడి చేయరాదని ట్రిబ్యునల్ గత ఏడాది ఆదేశించింది. 2016 అక్టోబర్‌లో మిస్త్రీని టాటా గ్రూప్ బోర్డు నుంచి తొలగించారు. ఇక రతన్ టాటా స్ధానంలో డిసెంబర్ 2012లో మిస్త్రీ టాటా గ్రూప్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment