
సాక్షి, న్యూఢిల్లీ : టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా సైరస్ మిస్ర్తీ పునర్నియమకంపై కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్‌క్లాట్ గత నెలలో ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ టాటా సన్స్ గురువారం సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని టాటా సన్స్ పిటిషన్‌లో కోరింది. ఒక్క కలం పోటుతో ఎన్‌క్లాట్ ఇచ్చిన ఉత్తర్వులు టాటా సన్స్ వ్యవస్ధాపకులు గత శతాబ్ధ కాలంగా వ్యయప్రయాసలతో తీర్చిదిద్దిన సంస్థ పాలనను, అంతర్గత కార్పొరేట్ వ్యవస్థను కుదిపివేసిందని పిటిషన్‌లో పేర్కొంది. సైరస్ మిస్ర్తీ నియామకాన్ని పునరుద్ధరిస్తూ ఎన్‌క్లాట్ జారీ చేసిన ఉత్తర్వులు గ్రూపు సంస్ధల్లోని కొన్ని లిస్టెడ్ కంపెనీల పనితీరులో గందరగోశానికి దారితీసిందని తెలిపింది. టాటా సన్స్ చైర్మన్, డైరెక్టర్‌గా సైరస్ మిస్త్రీ పదవీకాలం 2017 మార్చిలో ముగిసిందని, ఆయన తనను తిరిగి నియమించాలని కోరకపోయినా ఎన్‌క్లాట్ అత్యుత్సాహంతో ఆయనకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసిందని కోర్టుకు నివేదించింది.
Comments
Please login to add a commentAdd a comment