
సాక్షి, న్యూఢిల్లీ : 148 సంవత్సరాల చరిత్ర. కానీ, చైర్మన్లుగా పని చేసింది ఆరుగురు మాత్రమే. ఇది టాటా గ్రూప్ సంస్థ సంబంధించిన అరుదైన ఘనత. కానీ, ఎన్నడూ లేని రీతిలో సైరస్ మిస్ట్రీని అవమానకరమైన రీతిలో పదవి నుంచి తొలగించారు. ఈ వ్యవహారంపై సైరస్ సన్నిహితుడు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మాజీ సభ్యుడు నిర్మల్యా కుమార్ ఇప్పుడు తన బ్లాగ్‌లో స్పందించారు. హౌ సైరస్ మిస్ట్రీ వాజ్ ఫైర్డ్ అంటూ సరిగ్గా ఏడాది క్రితం జరిగిన ఘటనను ఆయన గుర్తు చేశారు.
ఒప్పందం ప్రకారం టాటా సన్స్ చైర్మన్ గా మార్చి 31, 2017 వరకూ సైరస్ మిస్ట్రీని బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. కానీ, అక్టోబర్ 24, 2016... బాంబే హౌస్‌లో బోర్డు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని మరీ ఆయన్ని తొలగించాలని నిర్ణయించింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆ నిర్ణయాన్ని ప్రకటించాలనుకున్నారు. కానీ, అప్పటికే మిస్ట్రీకి విషయం తెలిసిపోయింది. తనను బయటకు పంపడం ఖాయమని, ఈ విషయంలో తాను చేసేది ఏమీ లేదని ఆయన తెలుసుకున్నారు. వెంటనే ఆ విషయాన్ని తన భార్యకు మెసేజ్ చేశారు. ‘‘నా సమయం ముగిసింది. కాసేపట్లో బయటకు నన్ను బయటకు పంపించబోతున్నారు’’ అంటూ ఆయన సందేశం చేశారంట.
మిస్త్రీని చాలా అన్యాయంగా, ఘోరంగా తొలగించారు. దాదాపు సంవత్సరం పాటు ఎంతో జాగ్రత్తగా స్క్రూటినీ చేసి ఎంపిక చేసుకున్న మిస్త్రీని, ఎంపిక చేసుకున్నంత సమయం కూడా విధుల్లో ఎందుకు ఉండనివ్వలేదని నేను ప్రశ్నించా. వారి దగ్గరి నుంచి సమాధానం లేదు. కాస్తంత గౌరవంగా మిస్ట్రీని తొలగించే మార్గమున్నా, బోర్డు దాన్ని పాటించలేదని నిర్మల్యా ఆరోపించారు. ఇక అదే రోజు నిర్మల్యా కూడా ఉద్వాసనకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన సింగపూర్‌కు చెందిన ఓ యూనివర్సిటీలో ప్రోఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment