టాటా గ్రూప్లో భారీ సంచలనం | Tata Sons Replaces Cyrus Mistry as Chairman | Sakshi
Sakshi News home page

టాటా గ్రూప్లో భారీ సంచలనం

Published Mon, Oct 24 2016 5:26 PM | Last Updated on Mon, Sep 4 2017 6:11 PM

టాటా గ్రూప్లో భారీ సంచలనం

టాటా గ్రూప్లో భారీ సంచలనం

ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థ టాటా సన్స్లో అనూహ్య మార్పు చోటుచేసుకుంది. ఆ సంస్థ చైర్మన్ గా ఉన్న సైరస్ పల్లోంజి మిస్త్రీని విధుల నుంచి తప్పించారు.

ముంబయి: ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థ టాటా సన్స్లో అనూహ్య మార్పు చోటుచేసుకుంది. ఆ సంస్థ చైర్మన్ గా ఉన్న సైరస్ పల్లోంజి మిస్త్రీని విధుల నుంచి తప్పించారు. తాత్కాలిక చైర్మన్గా రతన్ టాటాను నియమిస్తూ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పూర్తి స్థాయి చైర్మన్ ను నాలుగు నెలల్లో సెలక్షన్ కమిటీ ఎంపిక చేయనుంది.

ఈ సెలక్షన్ కమిటీలో సభ్యులుగా రతన్ టాటా, వేణు శ్రీనివాసన్, అమిత్ చంద్రా, రోనెన్ సేన్, లార్డ్ కుమార్ భట్టాచార్య ఉన్నారు. సోమవారం నిర్వహించిన బోర్టు సమావేశంలో ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. సైరస్ మిస్త్రీ నాలుగు సంవత్సరాలపాటు టాటా సన్స్కు చైర్మన్ గా పనిచేశారు. తొలిసారి 2012 డిసెంబర్ 28న ఆయన చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. సైరస్ ఐరిష్ జాతీయుడు. పూర్తి స్థాయి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement