మిస్త్రీకి చుక్కెదురు
మిస్త్రీకి చుక్కెదురు
Published Tue, Jul 4 2017 7:07 PM | Last Updated on Tue, Sep 5 2017 3:12 PM
ముంబై: టాటా సన్స్ ఛైర్మన్‌గా ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. టాటా ట్రస్ట్స్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్. వెంకటరామన్ దాఖలు చేసిన దావాను ముంబై చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు విచారణకు స్వీకరించచింది. ఈ నేపథ్యంలో ముంబై కోర్టు సైరస్‌మిస్త్రీ, షాపూజీ మిస్త్రీ, నలుగురు డైరెక్టర్లకు సమన్లు జారీ చేసింది.
అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కృష్ణా పల్దేవార్ మిస్త్రీ, సోదరులు కోర్టు ఎదుట హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. మిస్టరీ సోదరులు, సైరస్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, స్టెర్లింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్లకు ఈ నోటీసులు జారీ చేసింది.
టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ తమపై తప్పుడు ఆరోపణలు చేశారని ఆరోపిస్తూ టాటా ట్రస్ట్స్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్. వెంకటరామన్ సైరస్ మిస్త్రీపై రూ.500కోట్ల డిఫమేషన్ కేసును చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ వద్ద పిటిషన్‌వేశారు. రూ .500 కోట్ల నష్టపరిహారాన్ని కోరుతో ఈ పిటిషన్ దాఖలు చేశారు. సైరస్ ఇన్వెస్ట్మెంట్స్ డైరెక్టర్లు , మిస్ట్రస్ కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న స్టెర్లింగ్ ఇన్వెస్ట్‌మెంట్ పై ఈ పిటీషన్ వేశారు.
2016 అక్టోబర్ 25న ఒక ఈ మెయిల్‌లో టాటాసన్స్ డైరెక్టర్లు, టాటా ట్రస్ట్కు చెందిన ఇతర ట్రస్టీలకు తప్పుడు ఆరోపణలు చేశారని తన పిటిషన్‌లో ఆరోపించారు. వెంకటరామన్ (వెంకట్) ఎయిర్ ఏషియా ఇండియా డైరెక్టర్ గా ఉన్నారు.
Advertisement
Advertisement