టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి అర్ధాంతరంగా ఉద్వాసనకు గురైన సరైస్ మిస్త్రీ ఎట్టకేలకు స్పందించారు. చైర్మన్ పదవి నుంచి తనను తొలగించిన పద్ధతి షాక్ గురిచేసిందంటూ బోర్డు సభ్యలకు ఆయన ఈమెయిల్ సంధించారు. ఇలా తనను తొలగించడం బోర్డుకు ఏమాత్రం శోభకరం కాదని పేర్కొన్నారు. కనీసం తన వాదన వినిపించే అవకాశం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది దేశంలో అసాధారణ విపరీత చర్య అంటూ బోర్డు మీద మండిపడ్డారు. టాటా బోర్డులో తొమ్మిది మంది సభ్యలు ఉండగా.. అందులో ఆరుగురు మిస్త్రీ ఉద్వాసనను సమర్థించిన విషయం తెలిసిందే.