మిస్త్రీకి ఇక దేవుడే దిక్కేమో!
టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి అర్థాంతరంగా ఉద్వాసనకు గురవ్వడం... తదుపరి జరిగిన పరిణామాలతో గ్రూప్లోని మిగతా కంపెనీలు టాటా వపర్, టాటా కెమెకిల్స్, టాటా స్టీల్లూ సైరస్ మిస్త్రీని చైర్మన్గా తొలగించడం ఆయన్ను తీవ్ర మనస్తాపానికి గురిచేసిందేమో.
అహ్మదాబాద్ : టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి అర్థాంతరంగా ఉద్వాసనకు గురవ్వడం... తదుపరి జరిగిన పరిణామాలతో గ్రూప్లోని మిగతా కంపెనీలు టాటా వపర్, టాటా కెమెకిల్స్, టాటా స్టీల్లూ సైరస్ మిస్త్రీని చైర్మన్గా తొలగించడం ఆయన్ను తీవ్ర మనస్తాపానికి గురిచేసిందేమో. ప్రశాంతత కోసం ఇక ఆయన ఆలయాల బాట పట్టారు. నిన్న జరిగిన టాటాస్టీల్ బోర్డు సమావేశంలో పాల్గొన్న ఆయన, ఆ కంపెనీ చైర్మన్గా ఉద్వాసనకు గురయ్యారు. ఆ సమావేశం అనంతరం వెంటనే మిస్త్రీ షిర్టీలోని సాయిబాబా టెంపుల్, శని శింగనాపూర్ దేవస్థానాలను దర్శించుకునేందుకు వెళ్లారు.
టాటాస్టీల్ బోర్డు సమావేశంలో పాల్గొన్న అనంతరం మొదట షిర్డీలోని సాయిబాబా టెంపుల్ను దర్శించుకున్నారు. భార్యతో కలిసి ఆయన ఈ ఆలయానికి వెళ్లారు. వారు సాయిబాబా సమాధిని, విగ్రహాన్ని దర్శించుకుని, టెంపుల్ ప్రసాదాన్ని స్వీకరించినట్టు ఆలయ అధికారప్రతినిధి మోహన్ యాదవ్ తెలిపారు. అనంతరం షిర్డీ సాయిబాబా టెంపుల్కు 30 నిమిషాల వ్యవధి దూరంలో ఉన్న శని శింగనాపూర్ దేవస్థానానికి వెళ్లారు. ఆలయంలో వారు పూజలు చేయించుకుని, శని దేవుడికి అభిషేకం నిర్వహించినట్టు అక్కడి అధికార ప్రతినిధి పేర్కొన్నారు.