షిర్డీలో రాష్ట్రేతర తెలుగు సమాఖ్య తొమ్మిదో సర్వసభ్య సమావేశాలు   | 9th General Assembly of Non-State Telugu Federation to held in Shirdi | Sakshi
Sakshi News home page

షిర్డీలో రాష్ట్రేతర తెలుగు సమాఖ్య తొమ్మిదో సర్వసభ్య సమావేశాలు  

Published Fri, Nov 29 2024 10:54 AM | Last Updated on Fri, Nov 29 2024 11:13 AM

9th General Assembly of Non-State Telugu Federation to held in Shirdi

షిర్డీలో రాష్ట్రేతర  తెలుగు సమాఖ్య తొమ్మిదో సర్వసభ్య సమావేశాలు    

నవంబర్‌30, డిసెంబర్‌ 1న షిర్డీలోని  శాంతికమల్‌ హోటల్‌లో వివిధ

అంశాలపై చర్చలు, సాహిత్య  కార్యకమ్రాల నిర్వహణ 

ముఖ్యఅతిధులుగా హాజరుకానున్న ఏపీ హెల్త్‌ మినిస్టర్‌ సత్యయాదవ్

తెలంగాణ సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు  

సాక్షి, ముంబై: రాష్ట్రేతర తెలుగు సమాఖ్య తొమ్మిదో సర్వసభ్య సమావేశాలు ఈసారి షిర్డీలో జరగనున్నాయి. షిర్డీలోని శాంతికమల్‌ హోటల్‌లో ఈ నెల 30, డిసెంబర్‌ 1వ తేదీల్లో రెండు రోజులపాటు జరగనున్న ఈ కార్యక్రమాల్లో సర్వసభ్య సమావేశాలతోపాటు వివిధ సాంస్కతిక, సాహిత్య కార్యక్రమాలు, మహారాష్ట్రతోపాటు ఇరత రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న తెలుగు శిక్షణా కార్యక్రమాల గురించి చర్చించనున్నారు. 

ఈ కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్య మంత్రి సత్యయాదవ్, తెలంగాణ సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యఅతిథులుగా, మండలి బుద్ద ప్రసాద్, తెలంగాణ సాంస్కృతిక విభాగం సంచాలకులు మామిడి హరికృష్ణ, సినీ నటుడు సాయికుమార్‌ గౌరవఅతిథులుగా హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దేశంలోని 12 రాష్ట్రాల నుంచి 350 మంది సభ్యులు, 100 మంది కళాకారులు, రచయితలతోపాటు మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడమి సభ్యులు కూడా పాల్గొననున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలకు స్థానిక తెలుగు సంఘాలతోపాటు షిర్డీ తెలుగు సంఘం అధ్యక్షుడు మాండవరాజా ఎంతగానో సహకరిస్తున్నారని వెల్లడించారు.  

ఊరేగింపుతో ప్రారంభం... 
రాష్ట్రేతర తెలుగు సమాఖ్య కార్యక్రమాలను రెండు కిలోమీటర్ల ఊరేగింపుతో ప్రారంభించనున్నారు. నవంబరు 30వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు శ్రీ సాయినివాస్‌ హోటల్‌ మెగా రెసిడెన్సీ నుంచి సభా ప్రాంగణం వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర తెలుగు ఫ్లకార్డులతో ఊరేగింపు జరగనుంది.  

వివిధ సాహిత్య, సామాజిక కార్యక్రమాల నిర్వహణ 
రాష్ట్రేతర తెలుగు సమాఖ్య 2015లో ఏర్పాటైంది. ఈ సమాఖ్య వివిధ రాష్ట్రాలలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకూ 18 జాతీయ సదస్సులు, వివిధ నగరాలలో స్థానిక సంస్థల సహకారంతో ప్రతి ఏటా అనేక సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాలు, విద్యా సంబంధిత కార్యక్రమాలను చేపడుతోంది. అలాగే ఆంగ్ల భాషా ప్రభావంతో మాతృభాషకు దూరమవుతున్న పిల్లలకు తెలుగు భాష నేర్పేందుకు కూడా కృషిచేస్తోంది. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో  స్థిరపడ్డ తెలుగు కవులు, కళాకారులు, సామాజిక కార్యకర్తలకు ఆయా రాష్ట్రాలతోపాటు వారి స్వరాష్ట్రాలలో గుర్తింపు తీసుకువచ్చే ప్రయత్నం చేయడం, తెలుగు రాష్ట్రాల్లో అందించే పురస్కారాలు వీరికి కూడా అందించేందుకు కృషి చేయడం, రాష్ట్రేతర ప్రాంతాలలో మాతృభాష పరిరక్షణ, తెలుగేతర రాష్ట్రాలలో ప్రభుత్వాలు తెలుగువారికోసం స్థలాలు కేటాయించేలా కృషిచేయడం వంటి ఆశయాలతో ముందుకు వెళుతోంది. ఈ నేపథ్యంలో షిర్డీతోపాటు మహారాష్ట్రలోని తెలుగు సంఘాల ప్రతినిధులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్రేతర తెలుగు సమాఖ్య అధ్యక్షుడు ఆర్‌ సందుర్‌ రావు, ప్రధాన కార్యదర్శి పివిపిసి ప్రసాద్‌లు ఓ ప్రకటనలో తెలిపారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement