Fedaration
-
షిర్డీలో రాష్ట్రేతర తెలుగు సమాఖ్య తొమ్మిదో సర్వసభ్య సమావేశాలు
సాక్షి, ముంబై: రాష్ట్రేతర తెలుగు సమాఖ్య తొమ్మిదో సర్వసభ్య సమావేశాలు ఈసారి షిర్డీలో జరగనున్నాయి. షిర్డీలోని శాంతికమల్ హోటల్లో ఈ నెల 30, డిసెంబర్ 1వ తేదీల్లో రెండు రోజులపాటు జరగనున్న ఈ కార్యక్రమాల్లో సర్వసభ్య సమావేశాలతోపాటు వివిధ సాంస్కతిక, సాహిత్య కార్యక్రమాలు, మహారాష్ట్రతోపాటు ఇరత రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న తెలుగు శిక్షణా కార్యక్రమాల గురించి చర్చించనున్నారు. ఈ కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య మంత్రి సత్యయాదవ్, తెలంగాణ సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యఅతిథులుగా, మండలి బుద్ద ప్రసాద్, తెలంగాణ సాంస్కృతిక విభాగం సంచాలకులు మామిడి హరికృష్ణ, సినీ నటుడు సాయికుమార్ గౌరవఅతిథులుగా హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దేశంలోని 12 రాష్ట్రాల నుంచి 350 మంది సభ్యులు, 100 మంది కళాకారులు, రచయితలతోపాటు మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడమి సభ్యులు కూడా పాల్గొననున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలకు స్థానిక తెలుగు సంఘాలతోపాటు షిర్డీ తెలుగు సంఘం అధ్యక్షుడు మాండవరాజా ఎంతగానో సహకరిస్తున్నారని వెల్లడించారు. ఊరేగింపుతో ప్రారంభం... రాష్ట్రేతర తెలుగు సమాఖ్య కార్యక్రమాలను రెండు కిలోమీటర్ల ఊరేగింపుతో ప్రారంభించనున్నారు. నవంబరు 30వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు శ్రీ సాయినివాస్ హోటల్ మెగా రెసిడెన్సీ నుంచి సభా ప్రాంగణం వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర తెలుగు ఫ్లకార్డులతో ఊరేగింపు జరగనుంది. వివిధ సాహిత్య, సామాజిక కార్యక్రమాల నిర్వహణ రాష్ట్రేతర తెలుగు సమాఖ్య 2015లో ఏర్పాటైంది. ఈ సమాఖ్య వివిధ రాష్ట్రాలలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకూ 18 జాతీయ సదస్సులు, వివిధ నగరాలలో స్థానిక సంస్థల సహకారంతో ప్రతి ఏటా అనేక సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాలు, విద్యా సంబంధిత కార్యక్రమాలను చేపడుతోంది. అలాగే ఆంగ్ల భాషా ప్రభావంతో మాతృభాషకు దూరమవుతున్న పిల్లలకు తెలుగు భాష నేర్పేందుకు కూడా కృషిచేస్తోంది. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో స్థిరపడ్డ తెలుగు కవులు, కళాకారులు, సామాజిక కార్యకర్తలకు ఆయా రాష్ట్రాలతోపాటు వారి స్వరాష్ట్రాలలో గుర్తింపు తీసుకువచ్చే ప్రయత్నం చేయడం, తెలుగు రాష్ట్రాల్లో అందించే పురస్కారాలు వీరికి కూడా అందించేందుకు కృషి చేయడం, రాష్ట్రేతర ప్రాంతాలలో మాతృభాష పరిరక్షణ, తెలుగేతర రాష్ట్రాలలో ప్రభుత్వాలు తెలుగువారికోసం స్థలాలు కేటాయించేలా కృషిచేయడం వంటి ఆశయాలతో ముందుకు వెళుతోంది. ఈ నేపథ్యంలో షిర్డీతోపాటు మహారాష్ట్రలోని తెలుగు సంఘాల ప్రతినిధులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్రేతర తెలుగు సమాఖ్య అధ్యక్షుడు ఆర్ సందుర్ రావు, ప్రధాన కార్యదర్శి పివిపిసి ప్రసాద్‌లు ఓ ప్రకటనలో తెలిపారు. -
జాతీయ వాలీబాల్ పోటీలకు ఫెడరేషన్ అనుమతి
ఉప్పలగుప్తం : గొల్లవిల్లి జెడ్పీ ఉన్న త పాఠశాల క్రీడాప్రాంగణంలో జరిగే జాతీయ వాలీబాల్ పోటీల కు ఫెడరేష¯ŒS ఆఫ్ ఇండియా అనుమతి లభించినట్టు పోటీల నిర్వాహకులు నిమ్మకాయల వెంకట రం గయ్య వాలీబాల్ అసోసియేష¯ŒS అధ్యక్షుడు నిమ్మకాయల జగ్గయ్యనాయుడు మంగళవారం తెలిపా రు. ఏటా మహశివరాత్రి సందర్భం గా ఏర్పాటు చేస్తున్న జాతీయ వాలీబాల్ పోటీలను వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 నుంచి 28 తేదీ వరకూ ఐదురోజులు నిర్వహిస్తామన్నారు. ఆయా తేదీల్లో మహిళ, పురుష జట్లతో నిర్వహించే జాతీయ వాలీబాల్ పోటీలకు ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చిందన్నారు. ఈ మేరకు వాలీబాల్ అసోసియేష¯ŒS రాష్ట్ర కార్యదర్శి ఎ రమణారావు నుంచి అనుమతి పత్రం అందుకున్నామన్నారు. ఈ పోటీల నిర్వహణకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించామని, జాతీయ క్రీడాకారులు, వివిధ రాష్ట్రాల వాలీబాల్ జట్లకు ఇన్విటేషన్లు అందిస్తున్నట్టు జగ్గయ్యనాయుడు తెలిపారు. ఈ పోటీల నిర్వహణకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించామని, జాతీయ క్రీడాకారులు, వివిధ రాష్ట్రాల వాలీబాల్ జట్లకు ఇన్విటేషన్లు అందిస్తున్నట్టు జగ్గయ్యనాయుడు తెలిపారు. ఫెడరేష¯ŒS ఆఫ్ ఇం డియా నుంచి తమ టోర్నీకి డేట్లు ఖరారు చేయించిన రాష్ట్ర కార్యదర్శి రమణారావుకు, జిల్లా కార్యదర్శి వై,బంగార్రాజుకు ఎ¯ŒSవీఆర్ వాలీబాల్ అసోసియేష¯ŒS గౌరవ అధ్యక్షుడు అరిగెల వెంకటముసలయ్య, కార్యదర్శి మద్దింశెట్టి సురేష్, సభ్యులు గొలకోటి సత్తిరాజు, ఉండ్రు రాజబాబు, గొలకోటి ఫణి, అరిగెల నరేష్‌లు కృతజ్ఞతలు తెలిపారు. -
టెన్నిస్ బాల్ క్రికెట్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడిగా రంభా ప్రసాద్
విజయవాడ స్పోర్ట్స్ : టెన్నిస్ బాల్ క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడిగా రంభా ప్రసాద్ నియమితులయ్యారు. ఢిల్లీలో గురువారం జరిగిన టెన్నిస్ బాల్ క్రికెట్ ఫెడరేషన్ సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రంభా ప్రసాద్ తెలిపారు. ఫెడరేషన్ ఉపాధ్యక్షుడిగా ఎంపిక కావడం పట్ల జిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి రమేష్, రోప్ స్కిప్పింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్ అభినందనలు తెలిపారు. -
టెన్నిస్ బాల్ క్రికెట్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడిగా రంభా ప్రసాద్
విజయవాడ స్పోర్ట్స్ : టెన్నిస్ బాల్ క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడిగా రంభా ప్రసాద్ నియమితులయ్యారు. ఢిల్లీలో గురువారం జరిగిన టెన్నిస్ బాల్ క్రికెట్ ఫెడరేషన్ సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రంభా ప్రసాద్ తెలిపారు. ఫెడరేషన్ ఉపాధ్యక్షుడిగా ఎంపిక కావడం పట్ల జిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి రమేష్, రోప్ స్కిప్పింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్ అభినందనలు తెలిపారు.