జాతీయ వాలీబాల్ పోటీలకు ఫెడరేషన్ అనుమతి
Published Tue, Dec 20 2016 11:44 PM | Last Updated on Mon, Sep 4 2017 11:12 PM
ఉప్పలగుప్తం :
గొల్లవిల్లి జెడ్పీ ఉన్న త పాఠశాల క్రీడాప్రాంగణంలో జరిగే జాతీయ వాలీబాల్ పోటీల కు ఫెడరేష¯ŒS ఆఫ్ ఇండియా అనుమతి లభించినట్టు పోటీల నిర్వాహకులు నిమ్మకాయల వెంకట రం గయ్య వాలీబాల్ అసోసియేష¯ŒS అధ్యక్షుడు నిమ్మకాయల జగ్గయ్యనాయుడు మంగళవారం తెలిపా రు. ఏటా మహశివరాత్రి సందర్భం గా ఏర్పాటు చేస్తున్న జాతీయ వాలీబాల్ పోటీలను వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 నుంచి 28 తేదీ వరకూ ఐదురోజులు నిర్వహిస్తామన్నారు. ఆయా తేదీల్లో మహిళ, పురుష జట్లతో నిర్వహించే జాతీయ వాలీబాల్ పోటీలకు ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చిందన్నారు. ఈ మేరకు వాలీబాల్ అసోసియేష¯ŒS రాష్ట్ర కార్యదర్శి ఎ రమణారావు నుంచి అనుమతి పత్రం అందుకున్నామన్నారు. ఈ పోటీల నిర్వహణకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించామని, జాతీయ క్రీడాకారులు, వివిధ రాష్ట్రాల వాలీబాల్ జట్లకు ఇన్విటేషన్లు అందిస్తున్నట్టు జగ్గయ్యనాయుడు తెలిపారు. ఈ పోటీల నిర్వహణకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించామని, జాతీయ క్రీడాకారులు, వివిధ రాష్ట్రాల వాలీబాల్ జట్లకు ఇన్విటేషన్లు అందిస్తున్నట్టు జగ్గయ్యనాయుడు తెలిపారు. ఫెడరేష¯ŒS ఆఫ్ ఇం డియా నుంచి తమ టోర్నీకి డేట్‌లు ఖరారు చేయించిన రాష్ట్ర కార్యదర్శి రమణారావుకు, జిల్లా కార్యదర్శి వై,బంగార్రాజుకు ఎ¯ŒSవీఆర్ వాలీబాల్ అసోసియేష¯ŒS గౌరవ అధ్యక్షుడు అరిగెల వెంకటముసలయ్య, కార్యదర్శి మద్దింశెట్టి సురేష్, సభ్యులు గొలకోటి సత్తిరాజు, ఉండ్రు రాజబాబు, గొలకోటి ఫణి, అరిగెల నరేష్‌లు కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement
Advertisement