టాటా సన్స్ సైరస్ మిస్త్రీల మధ్య పోటాపోటీ మాటల యుద్ధం మొదలైంది. తనకు వద్దన్నా బాధ్యతలు కట్టబెట్టి అనంతర స్వేచ్ఛ లేకుండా చేశారని, ప్రతి విషయంలో రతన్ టాటా జోక్యం చేసుకున్నారని, బోర్డు సభ్యులెవరూ తన మాటను సరిగా వినలేదని సైరస్ మిస్త్రీ చెప్పగా.. అవన్నీ కూడా తప్పుడు ఆరోపణలని టాటా సన్స్ కొట్టి పారేసింది. టాటా సన్స్ బోర్డు సైరస్ మిస్త్రీపై విశ్వాసం కోల్పోయిందని చెప్పింది. సైరస్ మిస్త్రీ చేసిన ఏ ఆరోపణలకు కూడా ఆధారాలే లేవని, ఆయన తనను తాను రక్షించుకునేందుకు చేసిన చర్యేనని గురువారం ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది.