రియాద్: దేశీ ఐటీ అగ్రగామి టీసీఎస్... పూర్తిగా మహిళలు పనిచేసే బీపీవో సెంటర్‌ను సౌదీ అరేబియా లో ప్రారంభించింది. జీఈ, సౌదీ ఆరామ్‌కో భాగస్వామ్యంతో ఈ మహిళా బీపీవోను ఏర్పాటు చేశామని టీసీఎస్ పేర్కొంది. గల్ఫ్‌లో 3,000 ఉద్యోగాలను ఈ సెంటర్ కల్పిస్తుందని తెలి పింది. సౌదీ ఆరామ్‌కో కేంద్ర కార్యాలయం దహ్రన్‌లో దీన్ని ఏర్పాటు చేశామని పేర్కొంది. ఈ ప్రాంత మహిళలకు మంచి కెరీర్‌ను అందించడానికి సౌదీ ఆరామ్‌కో, జీఈలతో కలిసి ఈ సెం టర్‌ను నెలకొల్పడం సంతోషంగా ఉందని టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ వ్యాఖ్యానించారు.