సాక్షి, ముంబై: టాటా గ్రూపు, సైరస్ మిస్త్రీ మధ్య వివాదంలో టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీకి భారీ షాక్ తగిలింది. ఈ మేరకు సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పును వెలువరించింది. ఛైర్మన్‌గా మిస్త్రీ తొలగింపును సుప్రీం సమర్ధించింది. ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఐ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం సైరస్ మిస్త్రీని తొలగింపు నిర్ణయం సరైనదని వ్యాఖ్యానించింది. తద్వారా నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ ( ఎన్‌సీఎల్ఏటీ ) ఉత్తర్వులను తిరస్కరించింది. దీంతో కార్పొరేట్ వార్‌లో టాటాకు భారీ ఊరట లభించింది.
గతేడాది జనవరి 10న టాటా సన్స్ చైర్మన్‌గా మళ్లీ సైరస్ మిస్త్రీని నియమించాలన్న ఎన్‌సీఎల్ఏటీ తీర్పును కొట్టేసింది సుప్రీంకోర్టు. కాగా 2016, అక్టోబర్‌లో సైరస్ మిస్త్రీని టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. (టాటా-మిస్త్రీ వివాదం సుప్రీం తీర్పు రిజర్వ్)
Comments
Please login to add a commentAdd a comment