
ముంబై : టాటా సన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా తన నియామకాన్ని పునరుద్ధరిస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌క్లాట్) తీసుకున్న నిర్ణయం తనను చట్టవిరుద్ధంగా తొలగించిన విధానంతో పాటు, తనను రతన్ టాటా ఇతర ట్రస్టీలు అణిచివేతకు గురిచేసిన తీరును గుర్తించిందని సైరస్ మిస్త్రీ వ్యాఖ్యానించారు. ఎన్‌క్లాట్ ఉత్తర్వులు తనకు అనుకూలంగా వచ్చినప్పటికీ టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ సహా, టీసీఎస్, టాటా టెలీసర్వీసెస్, టాటా ఇండస్ర్టీస్‌లో డైరెక్టర్ పదవుల కోసం పాకులాడటం లేదని స్పష్టం చేశారు. మరోవైపు సైరస్ మిస్త్రీని టాటా సన్స్ చీఫ్‌గా పునరుద్ధరిస్తూ ఎన్‌క్లాట్ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ టాటా గ్రూప్ సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఎన్‌క్లాట్ ఉత్తర్వులు టాటా గ్రూపు కంపెనీల్లో కార్పొరేట్ గవర్నెన్స్‌తో పాటు సంస్థలో దశాబ్ధాల తరబడి నెలకొన్న విధానాలను దెబ్బతీసేలా ఉన్నాయని సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో సంస్థ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment