బిజినెస్ స్కూళ్లకి పాఠంగా మిస్త్రీ రగడ
టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని అర్థాంతరంగా పీకివేసిన అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు ఇటు కార్పొరేట్ రంగానికి, అటు బిజినెస్ స్కూళ్లకి ఓ ప్రత్యక్ష పాఠంగా నిలుస్తున్నాయి.
ముంబై : బోర్డు రూంలో జరిగిన టాటా గ్రూప్ వివాదం దేశీయ కార్పొరేట్ చరిత్రలో కనివినీ ఎరుగనిది. టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని అర్థాంతరంగా పీకివేసిన అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు ఇటు కార్పొరేట్ రంగానికి, అటు బిజినెస్ స్కూళ్లకి ఓ ప్రత్యక్ష పాఠంగా నిలుస్తున్నాయి. లైవ్ లెసెన్స్కు ఇది ఓ మంచి ఉదాహరణ అని భావించిన బిజినెస్ స్కూళ్ల ప్రొఫెసర్లు, స్టూడెంట్స్కు గ్రూప్ బోర్డుల్లో జరిగే నిరంతర పరిణామాలపై పూసగుచ్చినట్లు వివరిస్తున్నారు.
విజయవంతమైన కార్పొరేట్ రంగాల పాలనలు, సంక్షోభ వాతావరణ పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు ఏ విధంగా ఉంటాయో టాటా గ్రూప్ను ఓ మంచి ఉదాహరణగా తీసుకుని లైవ్ లెసెన్స్గా తమ విద్యార్థులకు వివరిస్తున్నట్టు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ మేనేజ్మెండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ వంటి టాప్ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్లు చెబుతున్నారు.
సైరస్ మిస్త్రీ తొలగింపు వ్యవహారంలో, యాజమాన్య హక్కులు, సంస్థాగత పరిపాలన హక్కులపై ఎక్కువగా ఫోకస్ చేశామని ఐఐఎమ్-బెంగళూరులో కార్పొరేట్ స్ట్రాటజీ బోధించే రామచంద్రన్ జే తెలిపారు. బిజినెస్ గ్రూప్కు, సమ్మేళనానికి మధ్య ఉన్న తేడాను వివరించడంలో కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పారు. టాటా గ్రూప్ చైర్మన్ పదవి, జనరల్ ఎలక్ట్రిక్ చైర్మన్ పదవి ఒకేలా ఉండవని పేర్కొన్నారు. జనరల్ ఎలక్ట్రిక్, ఒకే చట్టపరిధికిందకు వస్తే, టాటా గ్రూప్ బహుళ చట్టపరిధిల కిందకు వస్తాయని తెలుపడంతో ఇది ఓ ఉదాహరణ అని వెల్లడించారు.
చైర్మన్ పోస్టు నుంచి ఓ వ్యక్తిని అర్థాంతరంగా తొలగించినప్పుడు ఇతర వ్యాపారాలపై పడే ప్రభావాన్ని వివరించడానికి కూడా బిజినెస్ స్కూళ్లకు ఇది ఓ కేస్ స్టడీలా ఉపకరిస్తుంది. ఫ్యామిలీ బిజినెస్లను, ఎమ్ఎఫ్ఏబీలను ప్రత్యేకంగా తమ కోర్సులో చేర్చినట్టు ఐఐఎమ్ ప్రొఫెసర్లు చెబుతున్నారు. నాయకత్వం, కార్పొరేట్ పాలన, సంస్థాగత సంస్కృతి, విక్రయించడం, విజన్, మిషన్ , బోర్డు విశ్వాసపాత్రమైన విధులు వంటి అన్నీ విషయాలను ఈ కేస్ స్టడీతో కవర్ చేస్తున్నామని ఎండీఐ-గూర్గావ్ స్ట్రాటజిగ్ మేనేజ్మెంట్ ఏరియా చైర్పర్సన్ విరేష్ శర్మ తెలిపారు. ఇది ఎంతో విలువైన లెసెన్స్ అని చెప్పారు.