మిస్త్రీ ధిక్కరణ పిటిషన్‌పై 18న ఉత్తర్వులు | NCLT reserves order on contempt plea by Cyrus Mistry’s family firms | Sakshi
Sakshi News home page

మిస్త్రీ ధిక్కరణ పిటిషన్‌పై 18న ఉత్తర్వులు

Published Tue, Jan 17 2017 1:18 AM | Last Updated on Tue, Sep 5 2017 1:21 AM

మిస్త్రీ ధిక్కరణ పిటిషన్‌పై 18న ఉత్తర్వులు

మిస్త్రీ ధిక్కరణ పిటిషన్‌పై 18న ఉత్తర్వులు

ముంబై: రతన్‌టాటా, టాటాసన్స్‌ డైరెక్టర్లపై సైరస్‌ మిస్త్రీ నేతృత్వం లోని రెండు సంస్థలు దాఖలు చేసిన ధిక్కరణ పిటిషన్‌పై తన ఉత్తర్వులను ఎన్‌సీఎల్‌టీ (నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌) ఈ నెల 18వ తేదీ వరకూ రిజర్వ్‌ చేసింది. ఎన్‌సీఎల్‌టీ డిసెంబర్‌ 22న ఇచ్చిన ఉత్తర్వులను తోసిపుచ్చి మిస్త్రీని బోర్డ్‌ నుంచి తొలగించడానికి టాటా సన్స్‌ నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది పిటిషనర్ల ఆరోపణ.

బీఎస్‌వీ ప్రసాద్‌ కుమార్‌ (మెంబర్‌–జ్యుడీషియల్‌), ఎన్‌ నల్లసేనాపతి (మెంబర్‌–టెక్నికల్‌)లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ముందు ఇరువర్గాల వాదనలు సోమవారం ముగిశాయి. తనను బోర్డ్‌ నుంచి తొలగించేందుకు జరపతలపెట్టిన ఫిబ్ర వరి 6 ఈజీఎంను నిలిపివేయాలని, ఇలాంటి ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా తదుపరి సమావేశాలనూ నిరోధించాలని పిటిషన్‌లో మిస్త్రీ కంపెనీలు కోరాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement