టీసీఎస్ చేజారిపోయేది..!
• రతన్ టాటా కంపెనీని అమ్మాలని చూశారు...
• రెట్టింపు వ్యయంతో కోరస్ కొనుగోలు
• ఈగో కారణంగా చెత్త నిర్ణయాలు...
• సైరస్ మిస్త్రీ తీవ్ర విమర్శలు...
ముంబై: టాటా గ్రూపు చైర్మన్ రతన్ టాటాను లక్ష్యంగా చేసుకుని ఆ గ్రూపు మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ మంగళవారం పలు తీవ్ర విమర్శలు చేశారు. టాటా గ్రూపునకు పాడి ఆవులుగా ఉన్న టీసీఎస్, జేఎల్‌ఆర్ విషయంలో తాను చేసిందేమీ లేదంటూ టాటా గ్రూపు మాతృ సంస్థ టాటా సన్‌స చేసిన ఆరోపణలను ఖండించిన మిస్త్రీ, రతన్‌టాటా విధానాలను ఎండగట్టారు. ఒకప్పుడు ఇదే పాడి ఆవు అరుున టీసీఎస్‌ను రతన్ టాటా ఐబీఎంకు విక్రరుుంచే ప్రయత్నం చేశారని బయటపెట్టారు. ఆయన ఈగో చెత్త నిర్ణయాలకు దారి తీసిందని, బ్రిటన్ స్టీల్ దిగ్గజం కోరస్‌ను రెట్టింపు ధరకు కొనుగోలు చేయడం, సీడీఎంఏ టెలికం వ్యాపారాన్ని అంటి పెట్టుకుని ఉండడం ఇందులో భాగమేనని మిస్త్రీ విమర్శించారు. టీసీఎస్, జేఎల్‌ఆర్ విజయానికి మిస్త్రీ నిజంగా పాటు పడలేదని, ఇవి రతన్ టాటా కృషి ఫలితంగానే పురోగమించి వారసత్వంగా మిస్త్రీకి అందివచ్చాయని, వాటి అద్భుత పనితీరు తన గొప్పతనంగా మిస్త్రీ చెప్పుకునేందుకు వీల్లేదంటూ టాటా సన్‌స ఈ నెల 10న లేఖను విడుదల చేసిన విషయం విదితమే. దీనికి ప్రతిగా మిస్త్రీ కార్యాలయం ఐదు పేజీల లేఖను తాజాగా విడుదల చేసింది. టీసీఎస్, జేఎల్‌ఆర్ (టాటా మోటార్స్‌లో భాగం) విషయంలో నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా మిస్త్రీ చేసిన ప్రయత్నాలను ఇందులో పేర్కొంది. ఈ రెండు కంపెనీల విజయం వెనుక ఎఫ్‌సీ కోహ్లీ, ఎన్ చంద్రశేఖరన్ (టీసీఎస్)... రాల్ఫ్ స్పెత్, రవికాంత్ (జెఎల్‌ఆర్) కృషే కారణమని స్పష్టం చేసింది. నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా మిస్త్రీ వ్యూహాత్మక మార్గదర్శనం చేశారని వివరించింది. టీసీఎస్ కోసం ప్రపంచవ్యాప్తంగా 60 మంది చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లతో ఆయన భేటీ అయ్యారని తెలిపింది. నాలుగేళ్ల మిస్త్రీ హయాంలో టీసీఎస్ నగదు నిల్వలు రెట్టింపై రూ.20,500 కోట్లకు చేరాయని వెల్లడించింది. జేఎల్‌ఆర్ విషయంలో ఈ రోజు తీసుకున్న నిర్ణయాల ప్రభావం భవిష్యత్తులో కనిపిస్తుందని పేర్కొంది. గ్రూపు మొత్తం లాభంలో ఈ రెండింటి ద్వారానే 90 శాతం సమకూరుతున్న విషయం గమనార్హం.
కోహ్లీ అనారోగ్యమే టీసీఎస్‌ను కాపాడింది
రతన్ టాటా టీసీఎస్‌ను ఐటీ దిగ్గజం ఐబీఎంకు విక్రరుుంచే ప్రయత్నం చేశారని మిస్త్రీ దుయ్యబట్టారు. టీసీఎస్ వ్యవస్థాపక చైర్మన్ అరుున ఎఫ్‌సీ కోహ్లీ అనారోగ్యమే రతన్ టాటా ప్రతిపాదనను జేఆర్డీ టాటా అమలు చేయకుండా ఆపిందన్నారు. ‘‘ఐబీఎంతో టాటా ఇండస్ట్రీస్‌కు ఉన్న జారుుంట్ వెంచర్‌కు రతన్ టాటా అధిపతిగా ఉన్న సమయంలో ఐబీఎం టీసీఎస్‌ను కొనుగోలు చేస్తుందన్న ప్రతిపాదనను జేఆర్డీ టాటా ముందుంచారు. అరుుతే, అప్పుడు కోహ్లీ అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నందున రతన్ టాటా ప్రతిపాదనపై చర్చించేందుకు జేఆర్డీ టాటా నిరాకరించారు’’ అని మిస్త్రీ కార్యాలయం వెల్లడించింది.
అరుుతే, దేశీయ సాఫ్ట్‌వేర్ రంగానికి ఆద్యుడైన కోహ్లీ టీసీఎస్ విక్రయ ప్రతిపాదనను తిరస్కరించారని, బంగారు భవిష్యత్తు ఉన్నందున టాటా గ్రూపు దాన్ని విక్రరుుంచవద్దని స్పష్టం చేశారని తెలిపింది. దీంతో ఆ ప్రతిపాదనను జేఆర్డీ టాటా తోసిపుచ్చారని... రతన్‌టాటా వల్ల టీసీఎస్ మరణానికి దగ్గరగా వెళ్లొచ్చిన సందర్భం ఇదని అభివర్ణించింది. టాటా, ఐబీఎం చెరిసగం వాటాతో 1992లో జారుుంట్ వెంచర్‌ను ఏర్పాటు చేయగా 1999లో విడిపోయారుు.
వన్‌మ్యాన్ ఇగో...
ఈ లేఖలో ఓ భాగాన్ని ‘ఒక వ్యక్తి ఇగో వర్సెస్ ఓ సంస్థ’గా పేర్కొంటూ... టాటాల ఇగో ఫలితం కోరస్‌ను 12 బిలియన్ డాలర్లకు (రూ.80 వేల కోట్లు సుమారు) కొనుగోలు చేయడమని పేర్కొంటూ... ఇది అంతకు ఏడాది ముందు ధర కంటే రెట్టింపుగా మిస్త్రీ కార్యాలయం పేర్కొంది. కోరస్‌కు అధికంగా చెల్లించడం వల్ల పెట్టుబడులు కష్టంగా మారి నిర్లక్ష్యానికి గురైందని, ఫలితంగా చాలా ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని విమర్శించింది. టెలికం వ్యాపారానికి సంబంధించి సలహాలను పెడచెవిన పెట్టి ప్రాచుర్యంలో ఉన్న జీఎస్‌ఎంను కాదని సీడీఎంఏ వ్యాపారంలోకి ప్రవేశించాలని టాటాలు నిర్ణయం తీసుకున్నారని పేర్కొంది. ఒక వ్యక్తి నిర్ణయం వేలాది మంది ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని వ్యాఖ్యానించింది.