ప్రపంచ టాప్-20 టెక్ బిలియనీర్లలో ప్రేమ్‌జీ, శివనాడార్
న్యూయార్క్ : ప్రపంచ టాప్-20 టెక్ బిలియనీర్లలో భారత్ నుంచి విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, హెచ్‌సీఎల్ టెక్ వ్యవస్థాపకుడు శివ నాడార్ ఉన్నారు. ఫోర్బ్స్ ‘టెక్నాలజీ రంగం టాప్-100 సంపన్నులు’ జాబితాలో మెక్రోసాఫ్ట్ సహ వ్యవ స్థాపకుడు బిల్ గేట్స్ (79.6 బిలియన్ డాలర్లు) అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. తర్వాతి స్థానాల్లో ఎలిసన్ (50 బిలియన్ డాలర్లు), జెఫ్ బిజోస్ ఉన్నారు. ప్రేమ్‌జీ 13వ స్థానంలో, నాడార్ 14వ స్థానంలో కొనసాగుతున్నారు.
ప్రేమ్‌జీ సంపద విలువ 17.4 బిలియన్ డాలర్లుగా, నాడార్ సంపద విలువ 14.4 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రేమ్‌జీ, నాడార్‌తో పాటు ఈ జాబితాలో మరో ఇద్దరు భారతీయులకు స్థానం దక్కింది. వారిలో సింఫనీ టెక్నాలజీ గ్రూప్ చైర్మన్ రమేశ్ వాద్వాని 2.8 బిలియన్ డాలర్ల సంపదతో 73వ స్థానంలో, భారత్ దేశాయ్ 2.5 బిలియన్ డాలర్ల సంపదతో 82వ స్థానంలో ఉన్నారు.