విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీ చేసిన ఒక తప్పు.. దేశంలో అగ్రశ్రేణి ఐటీ సంస్థగా ఉన్న ఇన్ఫోసిస్ (Infosys) పుట్టుకకు కారణమని తెలుసా? అప్పుడాయన ఆ తప్పు చేయకుండా ఉంటే ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉండేదే కాదు. ఇంతకీ ఆయన చేసిన తప్పేంటి.. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి (NR Narayana Murthy) స్వయంగా చెప్పిన ఆ విషయం గురించి తెలుసుకుందామా..
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) రంగంలో భారత్ గణనీయ అభివృద్ధి సాధించింది. ఇందుకు ఎన్నో సంవత్సరాలుగా అనేక మంది కార్పొరేట్ లీడర్లు చేసిన కృషి ఎనలేనిది. 1981లో కంపెనీని స్థాపించి దేశంలో ఐటీ అభివృద్ధి బాటలో పయనించడానికి అనేకమందికి మార్గం సుగమం చేసిన ఏడుగురిలో ఒకరైన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి ముందువరుసలో ఉంటారు.
ప్రస్తుతం ఇన్ఫోసిస్‌లో ఎలాంటి కీలక పాత్ర లేని 77 ఏళ్ల నారాయణమూర్తి.. తనతో విప్రో ఫౌండర్ అజీమ్ ప్రేమ్‌జీ చెప్పిన ఓ ఆసక్తికర విషయాన్ని ఇటీవల వెల్లడించారు. నారాయణమూర్తిని ఉద్యోగంలోకి తీసుకోకపోవడమే తాను చేసిన అతి పెద్ద తప్పులలో ఒకటి అని అజీమ్ ప్రేమ్‌జీ తనతో ఒకసారి చెప్పాడని సీఎన్‌బీసీ టీవీ18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. పరిస్థితులు అనుకూలంగా జరిగి ఉంటే ఇప్పుడు విప్రో సంస్థకు తిరగుండేది కాదని నారాయణ మూర్తి దంపతులు ఇదే ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
నారాయణ మూర్తి 1981 నుంచి 2002 వరకు 21 సంవత్సరాల పాటు ఇన్ఫోసిస్ సీఈవోగా కొనసాగారు. 2002 నుంచి 2006 వరకు బోర్డు ఛైర్మన్‌గా ఉన్నారు. ఆ తర్వాత చీఫ్ మెంటార్‌గా కూడా సేవలందించారు. 2011లో ఇన్ఫోసిస్ నుంచి రిటైరయ్యారు. నారాయణ మూర్తి ఇప్పుడు ఇన్ఫోసిస్ ఎమెరిటస్ చైర్మన్.
Comments
Please login to add a commentAdd a comment