నల్లధనంపై స్విస్ రాయబారి
ముంబై: స్వతంత్రంగా దర్యాప్తు చేయకుండా తమ దేశంలోని బ్యాంకుల్లో ఖాతాదారులందరి పేర్లు ఇవ్వాలని భారత అధికారులు కోరే అవకాశంలేదని భారత్‌లో స్విట్జర్లాండ్ రాయబారి లైనస్ క్యాస్టల్‌మూర్ అన్నారు. ఆశావహ దృక్పథంతో ఆధారాల్లేకుండా చేసే దర్యాప్తుకు తాము అనుమతిచ్చేది లేదని స్పష్టం చేశారు. భారత వ్యాపార దిగ్గజం అజీమ్ ప్రేమ్‌జీకి స్ఫూర్తిదాయక, సామాజిక నాయకత్వం అంశంలో స్విస్ ప్రభుత్వం అవార్డు ప్రదానం సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ట్యాక్స్ మోసగాళ్లకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఇస్తే తమ ప్రభుత్వం భారత్‌కు పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు. అయితే ఎక్కడి నుంచో ఎత్తుకొచ్చిన జాబితాపై మాత్రం సహకరించదని, ట్యాక్స్ మోసగాళ్లపై భారత దర్యాప్తు సంస్థలు ప్రాథమిక ఆధారాలు ఇవ్వాలని తెలిపారు. గతంలో వివిధ మార్గాల నుంచి ధన ప్రవాహానికి స్విస్ గమ్యంగా ఉండేదన్న క్యాస్టల్‌మూర్.. అదంతా ట్యాక్స్ కట్టిన డబ్బు అని చెప్పలేనన్నారు.
ఆధారాలిస్తే సహకరిస్తాం..
Published Mon, Dec 8 2014 2:14 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM
Advertisement
Advertisement